CM KCR Announced New Scheme for Auto Drivers: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR) ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్యాసింజర్ ఆటోలకు ఫిట్ నెస్, పర్మిట్ ఫీజు రద్దు చేస్తామని చెప్పారు. ఫిట్ నెస్ ఫీజు రూ.700, పర్మిట్ ఫీజు రూ.500 రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండూరులో (Manukonduru) ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. 'ఆటో డ్రైవర్లు ఏడాదికి ఓసారి ఫిట్ నెస్ చేయించుకోవాలి. ఫిట్ నెస్ కు, సర్టిఫికెట్ ఇచ్చేందుకు మొత్తం రూ.1200 అవుతుంది. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆ ఛార్జీలు రద్దు చేస్తాం.' అని ప్రకటించారు. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అలవెన్స్ వారి వేతనంలో ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే అని వెల్లడించారు. 


Also Read: Telangana Elections 2023: 'కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యం కాదు' - బీజేపీ మద్దతు పెరుగుతోందన్న కిషన్ రెడ్డి