Telangana Elections 2023 :  బీజేపీ అధికారంలోకి వస్తే ముథోల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తానని బీజేపీ నేత బండి సంజయ్ హామీ ఇచ్చారు.  12 శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కక్కుర్తి పడుతున్నాయన్నారు.  బీఆర్ఎస్ ఓట్ల కోసం ఎంఐఎం ను నమ్ముకుంటే… కాంగ్రెస్ ముస్లిం మతపెద్దలను నమ్ముకుందన్నారు. మథోల్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో బండి సంజయ్ మాట్లాడారు. బైంసాలోని నా హిందూ తమ్ముళ్లను ఎంఐఎం గూండాలు ఏ విధంగా హింసించాయో నాకింకా గుర్తుంది. హిందువుల ఇండ్లను తగలబెట్టి నరకం చూపిన సంఘటన మరువలేదు… బీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపిస్తే…. ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు ఒరిగిందేమైనా ఉందా? ఒక్క పనికొచ్చే పనైనా చేసిర్రా? వర్షం పడితే నిర్మల్, భైంసా పట్టణాలు ఎందుకు మునిగిపోతున్నాయని ప్రశ్నించారు. 


నాందేడ్ నుంచి బైంసా- నిర్మల్ మీదుగా మంచిర్యాల వరకు రైల్వే లైన్ నిర్మాణానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. హైదరాబాద్ నుంచి బోధన్- బాసర మీదుగా బైంసా వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారిని మహారాష్ట్రలోని మాహోర్ వరకు పొడిగించాలనే ప్రజల డిమాండ్ ను కేంద్రం ద్రుష్టికి తీసుకెళతానన్నారు. అట్లాగే ముథోల్ టెక్స్ టైల్ పార్క్, పత్తి పంట బాగా పండే ముధోల్ నియోజకవర్గంలో టెక్స్ టైల్ పార్క్, పీజీ కాలేజీ, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరిపై ఎత్తిపోతల పథకాలు నిర్మించి ముథోల్ నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సుద్ధ(గడ్డెన్న)వాగు ప్రాజెక్టు కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుంటానన్నారు.  


ముథోల్ లో బీజేపీ బీజేపీ బంపర్ మెజారిటీతో గెలవడం తథ్యమన్నారు.  మీలో హిందూ రక్తం ప్రవహిస్తే…మీరంతా ఛత్రపతి శివాజీ రూపాలైతే… నవంబర్ 3న ముథోల్ లో విజయోత్సవాలు జరపాల్సిందే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఆ పార్టీకి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్లే రాలేదు. ఆ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుంది? కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చెల్లని రూపాయి. ఆ పార్టీ ఇచ్చే హామీలకు విలువ లేదు. 14 వందల మంది యువకుల బలిదానాలతో తెలంగాణ వస్తే 10 ఏళ్ల పాలనలో ప్రజలకు కేసీఆర్ ఏం చేశారు? అసలు తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఏముందని బండి సంజయ్ ప్రశ్నించారు. 


ముథోల్ ను నేను దత్తత తీసుకుంటా… రామారావు పటేల్ గెలిచాక మళ్లీ వస్తా…బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం….బైంసాను మైసాగా మారుస్తా…. ఇప్పటి వరకు బైంసాకు నాలుగుసార్లు వచ్చిన. బైంసా లో ఎంఐఎం గూండాలు చేసిన అరాచకాలు నా కళ్లముందు ఇంకా మెదులుతున్నాయి. బాధితులందరికీ న్యాయం చేస్తా… ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా కదం తొక్కాలని పిలుపునచ్చారు.  నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో ఉద్యోగాలను మంత్రి సన్నిహితులే అమ్ముకుని.. నిరుద్యోగులు తిరగబడి ఆందోళనలు చేసిన విషయం పాదయాత్ర సందర్భంగా నా ద్రుష్టికి వస్తే… నేను వార్నింగ్ ఇస్తే ఆ నియామకాలను రద్దు చేసింది నిజం కాదా.. ఇంతకీ బాధితుల దగ్గర తీసుకున్న పైసలన్నీ వాపస్ ఇచ్చిండా లేదా? ముస్లిం సమాజానికి అప్పీల్ చేస్తున్నా… ఓట్ల కోసమే మీ వద్దకు వస్తున్నారు..టోపీలు పెట్టుకుని నమాజ్ పేరుతో మిమ్ముల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.