Telangana Elections 2023 : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం కాంగ్రె్స పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టిక్కెట్ ను మొదట ఆయనకే ఖరారు చేశారు. కానీ చివరి క్షణంలో విజయుడు అనే నేతకు బీఫాం ఇచ్చారు. దాంతో అబ్రహాం అసంతృప్తికి గురయ్యారు. ఇప్పపుడు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార బీఆర్‌ఎస్‌కు షాకిచ్చారు. ఇటీవలే పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎంపికైన చల్ల వెంకట్రామిరెడ్డి ఆలంపూర్ లో అబ్రహాంకు టిక్కెట్ వద్దని పట్టుబట్టారు. తన ఆధిపత్యాన్ని చాటేందుకు డాక్టర్ అబ్రహంకు బి ఫామ్ దక్కకుండా చేయడమే కాకుండా.. ఆయన వ్యక్తిగత సహాయకునిగా ఉండే విజయుడికి టికెట్ దక్కించుకున్నారు.
కేసీఆర్ తీరుతో అసంతృప్తికి గురైన అబ్రహాం
దీంతో అబ్రహం తీవ్ర నిరాశకు గురయ్యారు. నామినేషన్‌కు ఒకరోజు ముందు విజయుడికి టికెట్ ప్రకటించడంతో అప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసిన అబ్రహం నిరాశకు గురయ్యారు. మౌనంగా ఉండడం తప్ప రాజకీయంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు. అప్పటినుండి మౌనంగా ఉన్న అబ్రహం ఇటీవల అలంపూర్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వెళ్ళలేదు.
రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తందార్ల ఆధిపత్యంపై విమర్శలు
రిజర్వు నియోజకవర్గంలో పెత్తందార్ల ఆధిపత్యం ఏమిటి అని అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోవడంతో ఆయన తన అనుచరులతో వరుసగా సమాజంలో చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అబ్రహంకు కాకుంటే టికెట్టు తన కుమారునికి ఇవ్వాలని కోరిన కేంద్రంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న మంద జగన్నాథం డిమాండ్‌ను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదు. మంద జగన్నాథం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
వివాదాస్పదం అవుతున్నచల్లా వెంకట్రామిరెడ్డి తీరు
చల్లా వెంకట్రామిరెడ్డి తీరు , అధిష్టానం నిర్ణయంతో విసుగు ఎత్తిన పలువురు ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం డాక్టర్ అబ్రహం సైతం మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కొత్తకోట ప్రకాష్ రెడ్డి తదితరులతో కలిసి హైదరాబాద్ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అలంపూర్ నియోజకవర్గ అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే నలుగురు జడ్పీటీసీలు సహా మెజార్టీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిపోయినట్లయింది. ఎన్నికల సమయంలో ఇలా బీఆర్ఎస్ నుంచి నేతలు వచ్చి చేరడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ విజయంపై మరింత ధీమాగా ఉన్నారు.