6 Crores Money Seized in Hyderabad: తెలంగాణ ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోన్న పోలీసులు సరైన పత్రాలు లేకుండా సొమ్ము తరలిస్తే సీజ్ చేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ ఓఆర్ఆర్ అప్పా కూడలి వద్ద నిర్వహించిన సోదాల్లో 6 కార్లలో రూ.6.50 కోట్ల (6.5 Crores cash sieze) నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ముందస్తు సమాచారంతోనే ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నగదు ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన ఓ నేతదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్న అధికార, ప్రతిపక్ష నేతల వాహనాలను సైతం చెక్ చేస్తున్నారు. కేంద్ర బలగాల సమన్వయంతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ సరైన పత్రాలు లేని నగదు, బంగారం సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Elections 2023: భారీగా నగదు పట్టివేత - 6 కార్లలో రూ.6.50 కోట్లు స్వాధీనం
ABP Desam
Updated at:
18 Nov 2023 08:52 PM (IST)
Hyderabad News: తెలంగాణ ఎన్నికల వేళ భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో 6 కార్లలో తరలిస్తోన్న రూ.6 కోట్లు సీజ్ చేశారు.
హైదరాబాద్ నగర శివారులో భారీగా నగదు పట్టివేత