తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీలు పెరగనున్నాయి. రాష్ట్రంలో ఛార్జీల పెంపుపై డిస్కమ్‌లు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపాయి. ఏఆర్‌ఆర్‌, టారిఫ్‌ పెంపునకు డిస్కమ్స్ ప్రతిపాదనలు సమర్పించాయి. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు అనుమతి కోరాయి. శ్లాబుల వారీగా పెంపు వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని డిస్కమ్ అధికారులు తెలిపారు.  హెచ్‌టీ వినియోగదారులకు యూనిట్‌కు రూపాయి పెంపు ప్రతిపాదించారు. ఛార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6831 కోట్ల ఆదాయం రానుందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి ప్రకటించారు.  రైల్వే ఛార్జీలు, బొగ్గు రవాణా ఛార్జీలు పెరగడంతో విద్యుత్ ఛార్జీల పెంపు తప్పలేదని అధికారులు చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని,  ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు అఁ
అంటున్నారు. 


Also Read: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి.. 'టీఎస్ బీ-పాస్'ను ఆదర్శంగా తీర్చిదిద్దాలి


రూ.10 వేల కోట్ల ద్రవ్యలోటు


గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పై, వాణిజ్య వినియోగదారులకు రూ.1 పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. డిస్కమ్‌లకు రూ.10 వేల కోట్లు ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక డిస్కమ్స్ తెలియజేశాయి. దీంతో ఛార్జీలు పెంచక తప్పదనే సంకేతాలు ఇచ్చింది. సుమారు ఏడేళ్ల తర్వాత విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6831 కోట్ల ఆదాయం దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ భారమంతా వినియోగదారులై పడనుంది. ఎల్టీ కనెక్షన్ ల పై యూనిట్ కు 50 పైసలు పెంపుతో రూ.2,110 కోట్లు హెచ్టీ వినియోగదారుల ద్వారా రూ.1 పెంపు ద్వారా రూ.4,721 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని డిస్కంలు తెలిపాయి. 


Also Read: టీ పీసీసీ చీఫ్‌ను మార్చండి .. సోనియా , రాహుల్‌లకు జగ్గారెడ్డి లేఖ !


101 యూనిట్స్ వరకు ఉచితం
ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. 25.78 లక్షల పంపు సెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్, సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ పాటు పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ ఉందని డిస్కమ్స్ తెలిపాయి. రైల్వే ఛార్జీలు, బొగ్గు రవాణా ఛార్జీలు పెరగడంతో విద్యుత్ ఛార్జీల మోత అనివార్యం అయిందని ఎస్పీడీఎసీఎల్ సీఎండీ తెలిపారు. 


Also Read: రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తాం.. కేసీఆర్ వడ్లు ఎవరికి అమ్ముతారు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి