ఆరేళ్లలో దేశ స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణ తలసరి సహకారం సుమారు 72 శాతం వరకు పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ రాజ్య సభకు తెలియజేశారు. అయితే రాష్ట్రానికి కేంద్రం పన్నుల కేటాయింపు కూడా అలాగే జరిగిందని ఆయన వివరించారు.


2022-2023 లో తెలంగాణ రాష్ట్ర తలసరి దేశీయ ఉత్పత్తి గురించి సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నలకు పంకజ్ సమాధానమిచ్చారు. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్ర జీడీపీకి తలసరి సహకారం వివరాలను జాన్ అడిగినప్పుడు కేంద్రమంత్రి '' ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ తలసరి నికర జీడీపీ 2017-18లో రూ. 1,79,358, రూ. 2,09,848 2018-19లో, 2019-20లో రూ. 2,31,326, 2020-21లో రూ. 2,25,687, 2021-22లో రూ. 2,65,942, 2022-23లో రూ. 3,08,732లుగా ఉన్నట్లు తెలిపారు. 


కానీ తెలంగాణ నంబర్‌వన్‌గా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు . ఆ తరువాతి స్థానాల్లో  కర్ణాటక,హర్యానా ఉన్నాయి” అని కేంద్ర మంత్రి తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు అందించిన దానికంటే తక్కువ ఆదాయ పంపిణీని పొందుతున్న రాష్ట్రాల వివరాలను అడిగినప్పుడు మంత్రి 15 వ ఆర్థిక సంఘం సూత్రాన్ని ఉదహరించారు. 


“విభజించదగిన పూల్‌లో రాష్ట్రం వాటాను లెక్కించేటప్పుడు వివిధ అంశాలు పరిగణనలోకి తీసుకోబడ్డాయి. కాబట్టి, 2011 జనాభా లెక్కలను అనుసరించడం ద్వారా ఊహించడం సరైనది కాదు, ”అని మంత్రి అన్నారు.


“కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రాష్ట్రాల వారీగా వచ్చిన ఆదాయ సమాచారం కేంద్రం నిర్వహించదు” అని మంత్రి తెలిపారు.