Congress On Rape Case : రేప్ కేసులో నిందితుల్ని రక్షించే ప్రయత్నం జరుగుతోందని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.  జూబ్లీహిల్స్ అత్యాచారం ఘటనపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఘటనలను వివరణాత్మకంగా వివరించారు కానీ..   నిజాలు చెప్పినట్లు చూపిస్తూ అసలు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆనంద్ గారి మాటల్లో స్పష్టమైందని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. నిందితులు,  బాధితురాలు ప్రయాణించిన కారు కీలకమైన ఆధారమన్నారు.  మైనర్లు వాహనం నడుపునపుడు యజమానులకు పోలీసులు సమాచారం ఇవ్వాలని.. యజమానులకు నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించాలని గుర్తు చేశారు.  వాహనాలు ఎవరివి ..వారిని ఎందుకు విచారించలేదు ఆ వివరాలన్నింటినీ సి వి ఆనంద్ ఎందుకు వెల్లడించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 


కారు యజమానులెవరో ఎందుకుచెప్పడం లేదు? 


కెసిఆర్ పదవి ఇచ్చిన వక్ఫ్ బోర్డ్  చైర్మన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యుల పైన ఆరోపణలు వస్తున్నాయని ఘటనకు వినియోగించిన కారు యజమానులను పిలిపించి పోలీసులు విచారించారా అని రేవంత్ ప్రశ్నించారు.  కార్ యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనం గా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయని.. ఇన్నోవా కార్ మైనర్ నడిపి ఉంటే మోటార్ వాహన చట్టం కింద యజమానులకు నోటీసులు ఇచ్చి ఎందుకు విచారించ లేదని సి వి ఆనంద్ ను ప్రశ్నిస్తున్నానని రేవంత్ తెలిపారు. ఘటనకు కారణమైన వాహనం యజమాని వివరాలను ఎందుకు సి వి ఆనంద్ దాచి పెడుతున్నారని ప్రశ్నించారు.  ప్రభుత్వ వాహనాన్ని ఆసాంఘిక కార్యకలాపాలకు వినియోగించినప్పుడు కారు యజమాని వివరాలను ఎందుకు దాచి పెడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. 


రేప్ జరిగిన కార్లను వెంటనే ఎందుకు స్వాధీనం చేసుకోలేదు


ఘటన జరిగిన 28వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఇన్నోవా వాహనాన్ని పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ?  ఆధారాలను మాయం చేసి చెరిపేసి అసలు నిందితులు రక్షించేందుకు ఈ ప్రయత్నం చేసినట్లు కనపడుతుందని రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  హైదరాబాద్ నగరాన్ని పబ్స్ డ్రగ్స్ అడ్డాగా  కేటీఆర్, కేసీఆర్ మార్చారని.. మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.  ఇన్నోవా ,బెంజ్ కార్ యజమానులను కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని సి వి ఆనంద్ ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  


బాధితురాలు నిందితులను గుర్తు పట్టడం లేదని చెప్పడమేంటి ?


'జూబ్లీహిల్స్ రేప్ కేసులో హైదరాబద్ కమీషినర్ సీవీ ఆనంద్ మాట్లాడిన మాటలు  నిందితులను కాపాడే విధంగా వున్నాయి. బాధితురాలు నిందితులను గుర్తుపట్టట్లేదని సీవీ ఆనంద్ వ్యాఖ్యానించడం కేసు నీరుగార్చి నిందితులని కాపాడే ప్రయత్నం. అలాగే కొంతమంది రాజకీయకుల వత్తిడి వున్నట్లు కూడా  కనిపిస్తుంది'' ఏఐసీసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. 31న బాదితురాలు తండ్రి ఫిర్యాదు చేస్తే నిందుతులు ఎవరో గుర్తించడానికి 7రోజులు పట్టింది...అసలు ఎమ్మెల్యే కొడుకే లేడని జోయల్ డేవిడ్ చెప్పారు. నిన్న సీవీ ఆనంద్ ఎమ్మెల్యే కొడుకు కారు దిగి వెళ్లిపోయారని చేఫ్తున్నారని ఆరోపించారు.