CM Revanth Appoint 37 Corporations Chairmans: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల విడుదలైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఎంతగానో ఎదురుచూస్తోన్న నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించారు. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14నే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న వారు, పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన వారిని పదవులకు సీఎం ఎంపిక చేశారు. ఈ పదవుల కోసం ఇప్పటికే చాలామంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో పని చేసేందుకు ఈ పదవుల భర్తీ ఉపకరిస్తుందని రేవంత్ భావిస్తున్నారు. గతంలో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు లోక్ సభ ఎన్నికల్లోనైనా తమకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ ఇవ్వలేకపోయిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
కార్పొరేషన్ చైర్మన్లు వీరే
☛ పటేల్ రమేష్ రెడ్డి - టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్
☛ నేరెళ్ల శారద - మహిళా కమిషన్
☛ నూతి శ్రీకాంత్ గౌడ్ - బీసీ శ్రీకాంత్ గౌడ్
☛ రాయల నాగేశ్వరరావు - గిడ్డంగుల సంస్థ
☛ బండ్రు శోభారాణి - మహిళా సహకార అభివృద్ధి సంస్థ
☛ ఎన్. ప్రీతమ్ - ఎస్సీ కార్పొరేషన్
☛ శివసేనారెడ్డి - తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
☛ ఈరవత్రి అనిల్ - ఖనిజాభివృద్ధి సంస్థ
☛ జగదీశ్వరరావు (కొల్లాపూర్) - ఇరిగేషన్ డెవలప్ మెంట్ సంస్థ
☛ మెట్టు సాయికుమార్ - మత్స్య సహకార సంఘాల సమాఖ్య
☛ గుర్నాథ్ రెడ్డి (కొడంగల్) - పోలీస్ గృహ నిర్మాణ సంస్థ
☛ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ - విజయా డెయిరీ
☛ బెల్లయ్య నాయక్ - గిరిజన సహకార ఆర్థిక సంస్థ
☛ జంగా రాఘవరెడ్డి - ఆయిల్ ఫెడ్
☛ ఇనుగాల వెంకట్రామి రెడ్డి - కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ
☛ రియాజ్ - గ్రంథాలయ పరిషత్
☛ కాల్వ సుజాత - వైశ్య సంస్థ
☛ కాసుల బాలరాజు (బాన్సువాడ) - ఆగ్రోస్
☛ నిర్మలా గౌడ్ (జగ్గారెడ్డి సతీమణి) - పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
☛ ప్రకాష్ రెడ్డి (భూపాలపల్లి) - రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్
☛ ఎస్.అవినాష్ రెడ్డి - విత్తనాభివృద్ధి సంస్థ
☛ ఎం.విజయబాబు - రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సమాఖ్య
☛ మానాల మోహన్ రెడ్డి - రాష్ట్ర సహకార యూనియన్
☛ చల్లా నరసింహారెడ్డి - అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
☛ కె.నాగు - గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ
☛ జనక్ ప్రసాద్ - కనీస వేతన సలహా మండలి
☛ ఎం.వీరయ్య - వికలాంగుల సంస్థ
☛ నాయుడు సత్యనారాయణ - హస్తకళల సంస్థ
☛ ఎం.ఎ.జబ్బార్ - వైస్ ఛైర్మన్, మైనార్టీల ఆర్థిక సంస్థ
☛ మల్ రెడ్డి రాంరెడ్డి - రోడ్డు అభివృద్ధి సంస్థ
☛ పొదెం వీరయ్య - అటవీ అభివృద్ధి సంస్థ
☛ కె.నరేందర్ రెడ్డి - శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ
☛ పుంజాల అలేఖ్య - సంగీత నాటక అకాడమీ
☛ ఎన్.గిరిధర్ రెడ్డి - ఫిలిం డెలవప్ మెంట్ సంస్థ
☛ మన్నె సతీష్ కుమార్ - రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ
☛ జె.జైపాల్ - అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ
☛ ఎం.ఎ.పహీం - తెలంగాణ ఫుడ్స్