క్వార్టర్స్ దాటాడిలా
శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 20-22, 21-16, 21-19 తేడాతో సింగపూర్ షట్లర్ లీ జి జియాపై విజయం సాధించాడు. తొలి గేమ్ ఓడినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో దూసుకెళ్లిన లక్ష్యసేన్.. మిగిలిన గేమ్‌లు గెలిచి సెమీస్ చేరాడు. గంటా 11 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్... జియా లీపై అద్భుత విజయం సాధించాడు. కానీ సెమీస్‌లో ఆ అద్భుతం పునరావృతం కాలేదు.
అన్నీ ప్రతికూల ఫలితాలే
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్( All England Open Badminton Championships ) లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రెండో రౌండ్లోనే ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో సింధు 19-21, 11-21తో టాప్‌సీడ్, ప్రపంచ ఛాంపియన్, కొరియాకు చెందిన అన్ సె యంగ్ చేతిలో వరుస గేముల్లో ఓడింది . అంతకుముందు డబుల్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి తమ పోరాటాన్ని ముగించారు. జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్, చిరాగ్ ద్వయం 16-21, 15-21తో మహమ్మద్ షోహిబుల్, బాగాస్ మౌలానా జోడీ చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్ ఆరంభం నుంచే ఇరు జోడీలు హోరాహోరీగా తలపడడంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. 16-19 స్కోరు వద్ద తప్పిదాలు చేసిన సాత్విక్ జోడీ తొలి గేమ్‌ను చేజార్చుకొంది. ఇక, రెండో గేమ్‌లోనూ భారత జంట తడబడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇండోనేసియా జోడీ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంట 21-11, 11-21, 11-21తో చైనాకు చెందిన జాంగ్ షు జియాన్-జంగ్ యు చేతిలో పరాజయం పాలైంది.