Telangana News : 


రాజకీయ నాయకులు తమ అధినేతలపై చూపించే విశ్వాసం ఒక్కో సారి ప్రజల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.  తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్.. తమ నాయకుడు కేసీఆర్ అంటే ఎంత అభిమానమో మరోసారి బయట పెట్టారు.   ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై త‌న‌కున్న అభిమానాన్ని రాష్ట్ర గిరిజ‌న, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ చాటుకున్నారు. త‌న చేతిపై కేసీఆర్ పేరును ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నారు స‌త్య‌వ‌తి రాథోడ్. గిరిజ‌న యోధుడు కొమురం భీం స‌హ‌చ‌రుని వారసుల‌తో మంత్రి స‌త్య‌వ‌తి ప‌చ్చ‌బొట్టు వేయించుకున్నారు.            


తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?           


తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంజారహిల్స్, రోడ్ నెం10 లోని బంజారా భవన్‌లో నిర్వ‌హించిన‌ గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి ఆదివాసీ, బంజారాలు త‌మ సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఆదివాసీ బంజారాలు సిద్ధం చేసిన వివిధ రకాల ఉత్పత్తులు, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు.అక్కడ  పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయాలని కోరారు. నిర్వహకులు పచ్చబొట్టు నొప్పితో కూడినది అని చెప్పినా, మంత్రి కేసీఆర్ పేరును వేయాలని కోరారు.  కేసీఆర్ పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నారు స‌త్య‌వ‌తి.                            


కొమురం భీం సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రికి పచ్చబొట్టు వేశారు. దీంతో ఆమెను అభినందించి, న‌గ‌దు బ‌హుమానం అందించారు. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతుల‌ను ప్రోత్సాహించాలని మంత్రి ఈ సందర్భంగా    తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారని మంత్రి స్పష్టం చేశారు.                                           


ఆ ఇద్దరు నేతల వల్లే ఏపీకి కష్టాలు - మరోసారి హరీష్ వ్యాఖ్యలు !         


సత్యవతి రాథోడ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ గత ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ కేటాయించలేకపోయారు. అందుకే ఆమె పోటీ చేయలేకపోయారు. కానీ తర్వతా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్.. మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన సత్యవతిరాథోడ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎనలేని అభిమానం చూపిస్తూంటారు. ఇప్పుడు  పచ్చబొట్టు ద్వారా మరోసారి తన  అభిమానాన్ని, విధేయతను ప్రదర్శించారు.