తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం అయ్యాక సీఎం, మంత్రులు చేసే తొలి సంతకంపై ఆసక్తి నెలకొంది. ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారం సీఎం కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభిస్తారు. ఆయనతో పాటు మంత్రులు అందరూ తమతమ ఛాంబర్లలోకి వెళ్లి కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పంపిణీపై తొలి సంతకం చేయనున్నారు. గత అసెంబ్లీలో పోడు భూములను అవి సాగు చేసుకుంటున్న, అర్హులైన గిరిజనులకు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే.


మంత్రులు చేసే తొలి సంతకం ఈ ఫైల్స్ పైనే..



  • డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై కేటీఆర్ తొలి సంతకం 

  • కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరుపై హోమ్ మంత్రి మహమూద్ అలీ సంతకం 

  • జంట నగరాల్లోని హిందూ దేవాలయాల్లో దూప దీప నైవేద్యాల ఫైల్ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతకం 

  • శ్రమ శక్తి అవార్డుల ఫైలుపై మల్లారెడ్డి సంతకం 

  • అంగన్ వాడీలకు సన్న బియ్యం పంపిణీపై మంత్రి గంగుల కమలాకర్ సంతకం 

  • రెండో విడత దళిత బంధు పథకం ఫైలుపై సంతకం చేయనున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ 

  • సీతారామ ప్రాజెక్టు ఫైల్ పై మంత్రి తన్నీరు హరీష్ రావు తొలి సంతకం 

  • చెక్ డ్యామ్ ల నిర్మాణం ఫైలుపై మంత్రి నిరంజన్ రెడ్డి సంతకం 

  • కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతి ఫైలుపై మంత్రి ఎర్రబెల్లి తొలి సంతకం