బయట మనకు దొరికే వాటర్ బాటిల్ ₹20 ఉంటుంది. అలాగే ఖరీదైన వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. వాటి ధరలు వేలల్లో ఉంటాయి. కానీ లక్షల్లో ఖరీదు చేసే వాటర్ బాటిల్ ఉందంటే నమ్మశక్యంగా ఉండదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ధర అక్షరాల 50 లక్షల రూపాయలు. ఆ వాటర్ బాటిల్ మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. ఈ బాటిల్ 2010లోని గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇప్పటికీ ఈ వాటర్ బాటిల్ ని తలదన్నే ఖరీదైన నీళ్ల బాటిల్ తయారవ్వలేదు. దీంతో ఇది మళ్ళీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. దీని పేరు ‘ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యుటో ఎ మొడిగ్లైని’ (Acqua di Cristallo Tributo a Modigliani).


ఈ నీళ్ల బాటిల్ 750 ml నీటిని కలిగి ఉంటుంది. ఈ వాటర్ బాటిల్ ప్యాకేజింగ్, డిజైన్‌కే ధర మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బాటిల్ 24 క్యారెట్ బంగారంతో తయారు చేశారు. ఇక లోపల ఉన్న నీటిలో ఐదు గ్రాముల బంగారం ద్రవ రూపంలో కలిసి ఉంటుంది. అది కూడా 24 క్యారెట్ల బంగారం. ఆ నీరు ఎక్కడపడితే అక్కడ నుంచి తీసుకొచ్చింది కాదు. ఐస్లాండ్, ఫిజి, ఫ్రాన్స్ లోని హిమానీనదాలలో లభించే స్వచ్ఛమైన నీరు. బొట్టు బొట్టుగా వాటిని పట్టి కష్టపడి సేకరిస్తారు. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నీరు అదే. ఈ నీరు ఎంతో రుచికరమైనదని కూడా చెబుతున్నారు తాగిన వారు. 


ఈ బాటిల్ మనిషివ ముఖాన్ని పోలినట్టు ఉంటుంది.  ప్రసిద్ధ కళాకారుడైన ఫెర్నాండో అల్టమిరానో దీన్ని స్వయంగా తయారుచేశాడు. వీటిని చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే తయారు చేశారు. బిలియనీర్లు మాత్రమే వీటిని కొంటుంటారు. అందుకు ఆర్డర్ తీసుకున్నాకే వీటిని తయారు చేస్తారు. అప్పుడప్పుడూ వీటి వేలం కూడా జరుగుతుంది. ఆ వేలం డబ్బులను గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని రక్షించేందుకు చేయాల్సిన పనులకు ఖర్చు పెడుతుంటారు. 


గతంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ ఈ బాటిల్ నీళ్లు తాగినట్టు ఓ ఫోటో వైరల్ అయింది. నీతా ఇంతటి ఖరీదైన నీళ్లు తాగుతారా అని అప్పట్లో అంతా చర్చించుకున్నారు. కానీ అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని అప్పట్లోనే రిలయెన్స్ ప్రతినిధులు తెలిపారు. 


 
 Also read: భయంకరమైన జ్వరం కాంగో- కంటి నుంచి రక్తస్రావమై మరణించే అవకాశం
































Also read: నా భర్త నన్ను మోసం చేశాడు, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.