ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మంత్రులతో భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌కు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళో, రేపో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించింది. యాసంగిలో ధాన్యం కొంటారా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి రెండు రోజులు డెడ్‌లైన్ పెట్టారు. మరో వైపు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ అంశాలపై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆడపడుచులను కించ పరచడం అరాచకమే.. ఏపీ అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన
చుక్కా రామయ్యను కలిసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రముఖ విద్యావేత్త, జనగామ జిల్లా పాలకుర్తిలోని గూడురుకు చెందిన చుక్కా రామయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్యకు మంత్రి పాదాభివందనం చేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జనగామ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించిన చుక్కా రామయ్య హైదరాబాద్ సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని మంత్రి తెలిపారు. నిజాం నవాబ్, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్లారని గుర్తుచేశారు. జనగామలో ఉపాధ్యాయుడిగా చేరి, అనేక చోట్ల పనిచేసిన ఆయన, నాగార్జునసాగర్ ఆవాస పాఠశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ విరమణ చేశారని తెలిపారు. అనంతరం హైదరాబాద్ లో ఐఐటీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నట్లు కొనియాడారు. చుక్కా రామయ్య ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఆయనతో దేశంలో, రాష్ట్రంలోని సమకాలీన పరిస్థితులు, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడారు.
Also Read: ఏపీ అసెంబ్లీ ఘటనపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏం చేయాలో జగన్‌కు సలహా !
Also Read: పవిత్రమైన అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తెపై దారుణమైన మాటలా ? ఇక సహించబోమన్న నందమూరి కుటుంబం !
Also Read: హైదరాబాద్ కన్నా ఏపీ సరిహద్దు మద్యం దుకాణాలకే డిమాండ్ ! ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో తెలుసా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి