తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రశేఖర్ రావు గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూపాలపల్లె మొరంచపల్లి గ్రామం మునకపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధారణ హెలికాఫ్టర్‌తో వెల్లడం కష్టమని అధికారులు వివరించారు. గ్రామంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఆర్మీ అధికారులతో మాట్లాడుతున్నట్లుతెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురవడంతో మొరంచవాగు ఉప్పొంగింది. దీంతో గ్రామం నీటిలో చిక్కుకుంది. ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి చెట్లు, భవనాలు ఎక్కారు. ఒక్కరోజులోనే మొరంచపల్లెలో 62 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 






తెలంగాణలో భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న వరద భాదిత జిల్లాలకు సీఎం కేసీఆర్ స్పెషల్ అధికారుల నియమించారు.  ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. 
1 ములుగు జిల్లా -  కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సభ్య కార్యదర్శి
2 .భూపాల పల్లి -  పి.గౌతమ్, సెర్ప్, సీఈఓ
3 . నిర్మల్ - ముషారఫ్ అలీ, ఎక్సైజ్ శాఖ, కమిషనర్
4 . మంచిర్యాల  - భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ , స్పెషల్ సెక్రెటరీ.
5 . పెద్దపల్లి - సంగీత సత్యనారాయణ, 
6 .ఆసిఫాబాద్ - హన్మంత రావు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్


మరోవైపు భారీ వర్షాల ముప్పు ఇంకా పోలేదని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. 


ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలతో  ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీ.తో వీచే అవకాశం ఉంది.