Telangana Cabinet News: తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి కేబినెట్ సమావేశానికి వేళయింది. నేడు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4.45 గంటలకు తెలంగాణ సచివాలయంలో ఈ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.


నేడు మధ్యాహ్నమే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో నేడు తొలి భేటీ జరగనుంది. మంత్రులుగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క,  తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వరుసగా ప్రమాణం చేశారు. వీరిలో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు.


కేటాయించిన శాఖలు ఇవీ



  • భట్టి విక్రమార్క మల్లు - రెవెన్యూ శాఖ

  • ఉత్తమ్ కుమార్ రెడ్డి - హోం శాఖ

  • దామోదర రాజనర్సింహ - వైద్య ఆరోగ్య శాఖ

  • దుద్దిళ్ల శ్రీధర్‌బాబు - ఆర్థిక శాఖ

  • కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - మున్సిపల్

  • దనసరి అనసూయ (సీతక్క) - గిరిజన సంక్షేమ శాఖ

  • తుమ్మల నాగేశ్వరరావు - రోడ్డు, భవనాల శాఖ

  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - నీటిపారుదల శాఖ

  • జూపల్లి క్రిష్ణారావు - పౌర సరఫరాల శాఖ

  • పొన్నం ప్రభాకర్ - బీసీ సంక్షేమ శాఖ

  • కొండా సురేఖ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ