Breaking News Telugu Live Updates: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ, విమోచన దినోత్సవంపై కీలక నిర్ణయం

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Advertisement

ABP Desam Last Updated: 03 Sep 2022 06:13 PM
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ, విమోచన దినోత్సవంపై కీలక నిర్ణయం 

TS Cabinet Meet : సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి వర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. 

Background

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఆరో తేదీ నుంచి నిర్వహించనున్నారు.  శాసనసభ, మండలి సమావేశాలు  ఉదయం 11.30 గంట‌ల‌కు సమావేశాలు మొదలవనున్నాయి. అదే రోజు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ  భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయించనుంది. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనే దానిపై మొదటి రోజు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. వివిధ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. 


కేబినెట్, టీఆర్ఎస్ఎల్పీ భేటీ తర్వాత అసెంబ్లీ మీటింగ్ 
మునుగోడు ఉప ఎన్నికకు టైం దగ్గర పడుతున్న సందర్బంలో.. ఒకే రోజు కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలు నిర్వహిస్తుండటం ఇంట్రస్టింగ్ గా మారింది. అసెంబ్లీ సమావేశాల కోసమే కేబినెట్, టీఆర్ఎస్ఎల్పీ సమావేశం పెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. గత బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిసాయి. ఆరు నెలలోపు మల్లీ సెషన్స్ ప్రారంభించాల్సి ఉంది. ఈ లెక్కన సెప్లెంబర్ 14లోపు సెషన్స్ ప్రారంభంకావాలి. అందుకే ఆరో తేదీని ఖరారు చేసినట్లుగా భావిస్తున్నారు.  సీఎం కేసీఆర్ కార్యాచరణ అంతా మునుగోడు కోసమా లేక ముందస్తు ఎన్నికలకు వెళ్ళే వ్యూహమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు డిఫరెంట్ గా ఉండటంతో ఈ సమావేశాల్లో ఏ అంశాలు చర్చిస్తారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ కూడా ఉండటంతో జరుగుతున్న చర్చలకు బలం చేకూరుతుంది.  


Face Recognition App: ముఖ ఆధారిత హాజరు నమోదుపై నేటికీ సందిగ్ధత వీడటం లేదు. ఈనెల ఒకటో తేదీన మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చల్లో గందరగోళం నెలకొంది. సమావేశం తర్వాత సంఘాల నాయకులు సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు 15 రోజుల సమయం ఇచ్చారంటూ మీడియా ముందు చెప్పారు.


తమ ఫోన్లలోనే ముఖ ఆధారిత హాజరు యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఎస్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ తెలిపారు. ముఖ ఆధారిత యాప్ హాజరులో ఉన్న సాంకేతిక సమస్యలు పరిశీలించేందుకు 15 రోజుల సమయం కోరామని వెల్లడించారు. సాంకేతిక ఇబ్బందులు తొలగించిన తర్వాతే.. పూర్తి స్థాయిలో అమలు చేయాలని మంత్రి అన్నారని చెప్పారు.  


ఆ తర్వాత అలాంటిదేమీ లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 15 రోజుల సమయం ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నది నిజం కాదని కమిషనరేట్ పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాలతో  ముఖ ఆధారిత హాజరు (Face Recognition Attendance)ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తప్పని సరి చేయాలని తెలిపింది. ఈ క్రమంలోనే ప్రధానోపాధ్యాయులందరికీ ఆదేశాలు వెళ్లినట్లు వివరించింది. సాంకేతిక సమస్యలు వస్తే.. సరిదిద్దడానికి ఐటీ బృందానికి నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది


నేడు వర్ష సూచన 
ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు దాని పరసర ప్రాంతాలలో కొనసాగుతూ సముద్ర మట్టంపై 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో వాతావరణం వేడెక్కుతోంది.
తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రానికి ఆగస్టు 5 వరకు వర్ష సూచన ఉంది. నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు ఆగస్టు 5 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు వీచనున్నాయి. ఉక్కపోత అధికం కానుంది. అయితే కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడి ఉపశమనం కలుగుతుందని అధికారులు తెలిపారు. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.