Bandi sanjay Bus Yatra : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తోంది. జనవరి 16 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నియోజకవర్గాల పర్యటన తర్వాత బస్సు యాత్రకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. బండి సంజయ్, బీజేపీ సీనియర్ నేతలు వేర్వేరుగా యాత్రలు చేసే అవకాశం ఉంది.  బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలని నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ జనంలోకి వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాల్లో బస్సు యాత్రలు ఉండేలా బీజేపీ కార్యచరణ రూపోందిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి అయ్యాక పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రానికి చేరుకుని భారీ బహిరంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలు్సతోంది. 


బీజేపీ నేతలకు ప్లాన్ ఇచ్చి వెళ్లిన బీఎల్ సంతోష్ 


బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విస్తారక్, పాలక్ ల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ గెలిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ‘కేసీఆర్ హటావో.. తెలంగాణ బచావో’ పేరుతో ప్రజల్లోకి వెళ్తాలని నిర్ణయించుకున్నామని ఆ పార్టీ నేత లక్ష్మణ్ ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో అమిత్ షా  లేదా  జేపీ నడ్టా   తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వం పై ఛార్జ్ షీట్ విడుదల చేస్తామన్నారు. 


బీజేపీకి అభ్యర్థుల కొరత లేదన్న లక్ష్మణ్ 


ప్రతి నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీఎల్ సంతోష్  ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించామని చెప్పారు.  తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపు కోసం నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని లక్ష్మణ్ తెలిపారు.  మూడు నెలల కాలంలో వేల సంఖ్యలో మండల, జిల్లా స్థాయిలో మీటింగ్స్ ఉంటాయని, జనవరి 20 నుంచి ‘ప్రజా‌ గోస.‌.‌ బీజేపీ భరోసా’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతామన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్రం పంచాయతీలకు ఇస్తున్న నిధులను దోచుకుంటున్నారని టీఆర్ఎస్ సర్పంచులే చెబుతున్నారన్నారు.  


ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో  బస్సు యాత్రలు చేయాలని నిర్ణయం 


బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ఐదు విడతల పాదయాత్ర పూర్తి చేశారు. ఆరో విడత కూడా చేద్దామనుకున్నా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న సూచనలు కనిపించడంతో .. బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. బండి సంజయ్ ఒక్కరే అయితే తెలంగాణ మొత్తం కవర్ చేయడం కష్టం కాబట్టి.. ఇతర సీనియర్ నేతలు కూడా కలసి కట్టుగా మరో బస్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 


కొత్త బస్టాండ్‌ రేపిన చిచ్చు! దుబ్బాకలో మరింత ముదిరిన వివాదం - పోలీసుల భారీ బందోబస్తు