Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఆరో తేదీ నుంచి నిర్వహించనున్నారు. శాసనసభ, మండలి సమావేశాలు ఉదయం 11.30 గంటలకు సమావేశాలు మొదలవనున్నాయి. అదే రోజు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ, చర్చించాల్సిన అంశాలపై నిర్ణయించనుంది. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనే దానిపై మొదటి రోజు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. వివిధ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది.
వరుసగా కేబిెనెట్, టీఆర్ఎస్ఎల్పీ భేటీ తర్వాత అసెంబ్లీ మీటింగ్
మునుగోడు ఉప ఎన్నికకు టైం దగ్గర పడుతున్న సందర్బంలో.. ఒకే రోజు కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలు నిర్వహిస్తుండటం ఇంట్రస్టింగ్ గా మారింది. అసెంబ్లీ సమావేశాల కోసమే కేబినెట్, టీఆర్ఎస్ఎల్పీ సమావేశం పెడుతున్నట్లు చర్చ జరుగుతోంది. గత బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిసాయి. ఆరు నెలలోపు మల్లీ సెషన్స్ ప్రారంభించాల్సి ఉంది. ఈ లెక్కన సెప్లెంబర్ 14లోపు సెషన్స్ ప్రారంభంకావాలి. అందుకే ఆరో తేదీని ఖరారు చేసినట్లుగా భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ కార్యాచరణ అంతా మునుగోడు కోసమా లేక ముందస్తు ఎన్నికలకు వెళ్ళే వ్యూహమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు డిఫరెంట్ గా ఉండటంతో ఈ సమావేశాల్లో ఏ అంశాలు చర్చిస్తారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ కూడా ఉండటంతో జరుగుతున్న చర్చలకు బలం చేకూరుతుంది.
కేంద్రం, తెలంగాణ ఎవరి అప్పులు ఎక్కువ ? నిర్మలా సీతారామన్ విమర్శలతో మరోసారి లోన్ల పంచాయతీ !
కేంద్రానికి వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానాలు
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేయాలనే టీఆర్ఎస్ నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీహార్ పర్యటనలో కూడా సీఎం కేసీఆర్ ఇదే అంశంపై మాట్లాడారు. అలాగే ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం సూచించడంపై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
మునుగోడు ఉపఎన్నికా ? ముందస్తు ఎన్నికలా ?
మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్నవేళ శనివారం ఒకే రోజు కేబినెట్, టీఆర్ఎస్ఎల్పీ సమావేశాలు నిర్వహించడంతో పాటు రెండు రోజుల గ్యాప్‌తో అసెంబ్లీని కూడా సమావేశ పర్చడం హాట్ టాపిక్ ్వుతోంది. గతంలో ఎన్నడూ లేనట్లు కేబినెట్ మీటింగ్ ఎజెండా, టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ ఎజెండా కూడా ముందే బహిర్గతపర్చడంపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారేమోనన్న విధంగా నిర్ణయాలు తీసుకోవడం సహజమేనని.. సంచలనాత్మక పరిణామాలు ఏమీ ఉండవని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.