Telangana IPS Transfers: హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ చేపట్టింది ప్రభుత్వం. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేయగా.. తాజాగా మరో 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తెలంగాణ డీజీపీగా రవిగుప్తాను కొనసాగించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్, సీఐడీ చీఫ్ గా శిఖా గోయల్; రోడ్ సేఫ్టీ డీజీపీగా అంజనీ కుమార్, రైల్వే డీజీగా మహేష్ భగవత్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, సీఐడీ డీజీగా రమేష్ నాయుడు వ్యవహరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
- విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా రాజీవ్‌రతన్
- ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్
- రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా అభిలాష బిస్త్
- జైళ్లశాఖ డీజీగా సౌమ్య మిశ్రా
- సీఐడీ డీఐజీగా రమేష్ నాయుడు
- సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సంయుక్త కమిషనర్‌గా సత్యనారాయణ
- మధ్య మండల డీసీపీగా శరత్‌చంద్ర పవార్
- ఆబ్కారీ శాఖ డైరెక్టర్‌గా కమలాసన్‌రెడ్డి
- టీసీపీఎఫ్ అదనపు డీజీగా అనిల్ కుమార్
- హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
- ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్
- ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్‌రెడ్డి
- హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ-2గా తరుణ్ జోషి. హైదరాబాద్ మల్టీ జోన్-1 ఐజీగా అదనపు బాధ్యతలు
- సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా సైతం అదనపు బాధ్యతలు అప్పగించారు.