Ponnam Prabhakar: ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని..  కొంచెం ఓపిక పట్టాలని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే.. మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఉపాధి కోల్పోయామంటూ ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు. కొందరైతే బాధతో కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు కూడా దిగారు. ఈ నేఫథ్యంలోనే.. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపశమనం కలిగించే ముచ్చట వినిపించింది. ఆటో డ్రైవర్లకు కచ్చితంగా న్యాయం చేస్తామని.. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.                  


 ప్రజాభవన్‌లో కొనసాగుతోన్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రెండు వైపులా భారీ క్యూలైన్లలో జనాలు బారులు తీరారు. ప్రజల సమస్యలను అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఉదయం 10 గంటలలోపు హాజరైన వారికి అవకాశం కల్పించారు. అయితే.. అందులో.. అగ్రి గోల్డ్ బాధితులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ధరణి, పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల లాంటి సమస్యలకు సంబంధించిన బాధితులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.                            


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల మీటింగ్‌కు అంతా రెడీ - ఎప్పుడు కలుస్తారంటే?


తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్, బీఎంఎస్ అనుబంధ టీఎస్‌పీటీఎంఎం  ఆధ్వర్యంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణాలపై పునరాలోచన, బస్సుల సంఖ్య తగ్గించడం, ఓలా, ఉబర్, ర్యాపిడ్ బైక్‌ల అక్రమ వ్యాపారాన్ని నిషేధించడం వంటి డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. త్వరలో ఆటో యూనియన్లతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  


కేటీఆర్‌, సిద్ధరామయ్య మధ్య ట్వీట్‌ వార్‌- ఆరు గ్యారెంటీల అమలుపై మాటల యుద్ధం          


 తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆ విషయం మా దృష్టికి వచ్చిందని అన్నారు. ఆటో వాళ్లు మా సోదరులే… వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలిపారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని సూచించారు. అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వ ఆలోచన ఉంటుందని అన్నారు. ఎవరూ నిరసపడొద్దని, త్వరలోనే మీ సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతామని తెలిపారు.