Lokesh Kanagaraj About Rajinikanth: ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాలతో కనీవినీ ఎరుగని విజయాలను అందుకున్నారు

  దర్శకుడు లోకేష్ కనగరాజ్. యాక్షన్‌, ఎమోషనల్‌ కథాంశాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపారు. రీసెంట్ గా విజయ్ దళపతితో కలిసి ‘లియో‘ అనే సినిమా చేశారు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. తాజాగా ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ‘తలైవా 171’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 


కథ విని ఆల్ ది బెస్ట్ చెప్పారు!


తాజాగా ‘తలైవా 171’  సినిమాకు సంబంధించి దర్శకుడు లోకేష్ కీలక విషయాలను వెల్లడించారు. కథను రజనీకాంత్ కు ఎలా చెప్పారు? చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు? సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే అంశాల గురించి వివరించారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏప్రిల్ లో మొదలుకానున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఈ సినిమా గురించి తెలిసిన వెంటనే కమల్ హాసన్ తనకు ఫోన్ చేసిన అభినందించినట్లు వెల్లడించారు. “ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 2024 వరకు ఈ పనులు కంప్లీంట్ అవుతాయి. కంప్లీట్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. చాలా ఏండ్ల తర్వాత రజనీ ఇలాంటి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ విని తలైవా చాలా సంతోషించారు. వాస్తవానికి అనిరుధ్ తో కలిసి వెళ్లి ఆయనకు కథ వినిపించా. స్టోరీ విని ఆయన నన్ను కౌగిలించుకున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. రజనీ ఓకే చెప్పడంతో నాకు చాలా సంతోషం కలిగింది” అని వెల్లడించారు.      


ఈ సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించని షారుఖ్?


ఇక ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను సంప్రదించారట. అయితే, తాను ఇప్పటికే చాలా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు చెప్పిన ఆయన, ఇకపై తన సొంత సినిమాల మీద ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారట. ఈ నేపథ్యంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ఈ సినిమాలో ముఖ్యపాత్ర కోసం అడిగారట. తను ఈ ప్రాజెక్టు పట్ల ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.  మూవీ కథ వినేందుకు కూడా అంగీరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీలో తమిళ హీరో శివకార్తికేయన్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.   


వచ్చే ఏడాది దీపావళికి విడుదల?


ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని దర్శకుడు లోకేష్ భావిస్తున్నారట. ఏప్రిల్ 2024లో షూటింగ్ మొదలు పెట్టి, దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. 'జైలర్' తో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్,    లోకేష్ కనగరాజ్ తో సినిమా చేస్తుండటంతో  ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి. కార్తీ, కమల్ హాసన్, విజయ్ లాంటి స్టార్స్ కి బ్లాక్ బస్టర్ అందించిన లోకేష్ రజనీకాంత్ కి కూడా మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.


Read Also: ఆహాలోకి తరుణ్ భాస్కర్ 'కీడా కోలా' - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?