Raja Singh Suspension Lifted: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ అధిష్ఠానం సస్పెన్షన్ ఎత్తివేసింది. బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ ఆదివారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను గతేడాది ఆగస్టులో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రాజాసింగ్ వివరణ ఇవ్వగా, దీన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం ఆయనపై సస్పెన్షన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్ ప్రకటన విడుదల చేశారు.


మళ్లీ గోషామహల్ నుంచే పోటీ


తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం విడుదల చేసింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ కే అవకాశం ఇచ్చింది. గోషామహల్ నుంచే తాను పోటీ చేస్తానని ఇది వరకే రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణుల సమన్వయంతో బీజేపీ గెలుపునకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. 


Also Read: తెలంగాణ బీజేపీ తొలి జాబితా వచ్చేసింది - కేసీఆర్ పై ఈటల పోటీ