Special Trains : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్వీసులను అదనంగా నడుపుతున్నట్లు ప్రకటించింది.
నాందేడ్ -విశాఖపట్నం-నాందేడ్ స్పెషల్ (07082/07083)
1. రైలు నెం. 07082 నాందేడ్-విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28 మధ్యాహ్నం 01.15 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని 07.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
2. తిరుగు ప్రయాణంలో రైలు నం. 07083 విశాఖపట్నం-నాందేడ్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి అక్టోబర్ 29న సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 06.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని 06.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 03.10 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. .
07083 ప్రత్యేక స్టాప్‌లు: దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, మధిర, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర.
ఈ రైలు కంపోజిషన్: 3వ ఏసీ బోగీలు-4, స్లీపర్-11, జనరల్ క్లాస్-5, సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లు- 2 ఉంటాయి.
కాచిగూడ-పూరి-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు (07565/07566)
1. రైలు నెం. 07565 కాచిగూడ - పూరీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28వ తేదీ రాత్రి 8.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.05 గంటలకు దువ్వాడ చేరుకుని 09.07 గంటలకు బయలుదేరిసాయంత్రం 05.30 గంటలకు పూరీ చేరుకుంటుంది.
2. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 07566 పూరీ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 29న 10.45 గంటలకు పూరీలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.35 గంటలకు దువ్వాడ చేరుకుని 07.37 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 2.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
స్టాపులు : మల్కాజిగిరి, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవర్లస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మాపూర్, ఖుర్దా రోడ్డు
కంపోజిషన్ : ఫస్ట్ కమ్ సెకెండ్ ఏసీ బోగీలు-1, సెకెండ్ ఏసీ-1, స్లీపర్ క్లాస్ బోగీలు-10, జనరల్ సెకండ్ క్లాస్-6, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ కోచ్‌లు-2
ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.
100 ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం 100 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. నవంబర్ రెండో తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించుకుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తిరుపతి-ఔరంగాబాద్( రైలు నెం. 07637) మధ్య నవంబరు 6 నుంచి 27వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉండనుంది. ఔరంగాబాద్- తిరుపతి(నెం. 07638) మధ్య నవంబరు 7 నుంచి 28వ తేదీ వరకు ప్రతి సోమవారం నడపనున్నారు. తిరుపతి-అకోలా (రైలు నెం.07605), హైదరాబాద్-తిరుపతి(రైలు నెం.07643), విజయవాడ-నాగర్ సోల్(రైలు నెం.07698), కాకినాడ-లింగంపల్లి(రైలు నెం.07141), కాజీపేట-తిరుపతి(రైలు నెం.07091), మచిలీపట్నం-సికింద్రాబాద్(రైలు నెం.07185) మధ్య స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది.