తెలంగాణలో ఇప్పుడు జీవో నెంబర్ 111ని రద్దు చేసిన అంశం రాజకీయ దుమారం రేపుతోంది. చట్టపరంగా ఆ జీవో రద్దు సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే జీవో నెం 111పై 2007 హైకోర్టు ఓ తీర్పు ఇచ్చిది. ఆ తీర్పు ప్రకారం జీవో నెంబర్ 111 పరిధిలోకి వచ్చే గ్రామాలపై ఎలాంటి నిర్ణయాలు సాధ్యం కాదు. తదుపరి నిర్ణయం వెలువడేంత వరకూ ఆ స్టే ఉంటుందని హైకోర్టు తీర్పులో చెప్పింది. ఈ అంశం ఇంకా న్యాయవివాదాల్లోనే ఉంది. గత ఏడాది ఆగస్టులో కూడా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరివాహక ప్రాంతాల పరిరక్షణ జీవో 111పై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు కోరింది. వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లలో గల ప్రైవేట్‌ భూములు ఈ జీవో పరిధిలోకి రావంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. తర్వాత ప్రభుత్వంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టుకు  జీవో నెంబర్ 111ను ఎత్తివేస్తున్నామని అఫిడవిట్ సమర్పించలేదు.   దీంతో న్యాయపరమైన చిక్కులు ఇంకా ఉన్నాయన్న అభిప్రాయం వినపిిస్తోంది. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే విషాయన్ని ట్వీట్ చేశారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన 69 జీవో చెల్లదని అప్పటి తీర్పు కాపీలను పోస్ట్ చేశారు. 



జీవో.111ను తొలగింపు విషయంలో ప్రభుత్వం చీఫ్ సెక్రకటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో సభ్యలుగా మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఐ అండ్ సీఏడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండబ్ల్యూ ఎస్బి మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ పిసిబి మెంబర్ సెక్రటరీ, హెచ్ఎండిఏ డైరెక్టర్ ప్లానింగ్ తదితరులు సభ్యులుగా వున్నారు. జీవో ఎత్తవేతపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ చివరకు ఎత్తవేతకే ప్రతిపాదనలు పంపింది. జీవో ఎత్తివేసినా  ఈ రెండు జలాశయాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కొన్ని మార్గదర్శకాలను సూచించింది. 
 
ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే జీవో.111ను ఎత్తివేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో 69 జారీ చేసింది. ఇప్పటి వరకు జంటజలాశయాలకు 10. కి.మీ. పరిధిలో ఏ రకమైన నిర్మాణాలు, పరిశ్రమలు చూపించకూడదన్న నిబంధన కొనసాగుతోంది.  జీవో 111 అమలు వల్ల పెద్దయెత్తున అభివృద్ధి కుంటుపడుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. జంటనగరాల తాగునీటి అవసరాలు ఈ జలాశయాల నుంచి బాగా తగ్గాయి. కృష్ణాప్రాజెక్ట్, గోదావరి ప్రాజెక్ట్ ల నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా జరగుతోంది. అయితే ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్న ఉన్నందున ప్రభుత్వం జారీ చేసిన జీవో 69 చెల్లుతుందా లేదా అన్నది చర్చనీయాంశం అవుతోంది. దీనిపై న్యాయస్థానంలోనే క్లారిటీ రావాల్సి ఉంది.