Just In





Gaalivaana Lands In Trouble: వివాదంలో 'గాలివాన' వెబ్ సిరీస్, ఆఖరి ఎపిసోడ్‌లో అదొక్కటీ - బూతులు తిడుతున్నారు
సాయి కుమార్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 'గాలివాన' వెబ్ సిరీస్ విమర్శల పాలవుతోంది. దానికి కారణం ఏంటి?

Gaalivaana Web series Issue: మానవ సంబంధాలు చాలా సున్నితమైనవి. వెబ్ సిరీస్, సినిమా, సీరియల్... ఏదైనా ఆ సంబంధాలను చూపించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే... వివాదం రాజుకుంటుంది. విమర్శలు వస్తాయి. అందుకు ఉదాహరణ 'గాలివాన' వెబ్ సిరీస్‌పై వస్తున్న విమర్శలు.
రాధికా శరత్ కుమార్, సాయి కుమార్ డిజిటల్ తెరకు పరిచయమైన వెబ్ సిరీస్ 'గాలివాన'. ఇటీవల జీ5 ఓటీటీలో విడుదలైంది. బీబీసీ తీసిన 'వన్ ఆఫ్ అజ్'కు తెలుగు అడాప్షన్ ఇది. కథను చాలా వరకూ తెలుగీకరించారు. తెలుగు నేపథ్యానికి తగ్గట్టుగా మార్పులు చేశారు. అయితే, క్లైమాక్స్ ట్విస్ట్‌ను మాత్రం చేంజ్ చేసినట్టు లేరు. ఇప్పుడు ఆ మెయిన్ ట్విస్ట్ మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
'గాలివాన' వెబ్ సిరీస్‌లో ప్రేమలు, పెళ్లిళ్లు ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే... రాధిక భర్త ప్రేమించిన అమ్మాయిని సాయి కుమార్ పెళ్లి చేసుకుంటారు. రాధిక కుమారుడు, సాయి కుమార్ కుమార్తె ప్రేమలో పడతారు. అది సాయి కుమార్‌కు నచ్చదు. దాంతో అతడు ఏం చేశాడు? పిల్లల ప్రేమ ఎందుకు నచ్చలేదు? అనే అంశాలకు అసలు కారణం ఆఖరి ఎపిసోడ్‌లో చూపించారు.
Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Trolls On Gaalivaana Web Series: పాశ్చాత్య దేశాల్లో ఇటువంటి కథలు చూసి ఉండొచ్చు. ప్రజలు ఆమోదించి ఉండొచ్చు. కానీ, భారతదేశంలో ఆమోదించడం కష్టమే. అందువల్ల, విమర్శలు వస్తున్నాయి. దర్శకుడిని చెప్పుతో కొట్టాలని ఒకరు ట్వీట్ చేశారు. వెబ్ సిరీస్‌లో మొదటి ఆరు ఎపిసోడ్స్‌కు 3 రేటింగ్ ఇచ్చిన ఒకరు, చివరి ఎపిసోడ్‌కు వన్ రేటింగ్ ఇచ్చారు. కొంత మంది బూతులు కూడా తిడుతున్నారు. దీనిపై వెబ్ సిరీస్ టీమ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Also Read: డెలివరీ తర్వాత గ్లామరస్‌గా ఉండదు. కానీ, అందంగా ఉంటుంది - కాజల్ భావోద్వేగభరిత లేఖ