Kavitha Blast: తండ్రి కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందని.. 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేదని లేఖలో పేర్కొన్నారు. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యామని.. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని సలహా ఇచ్చారు. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారన్నారు.
నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ.. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని కవిత లేఖలో పేర్కొన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారు. ఇప్పటికైనా 1-2 ప్లీనరీ పెట్టాలని లేఖలో కోరారు.
ఈ లేఖలో కేసీఆర ప్రసంగంపై తన అభిప్రాయాలను చెప్పారు. కొన్ని అంశాలు బాగున్నాయని చెప్పిన కొన్ని అంశాలను విస్మరించడం పై ప్రశ్నించారు. బీజేపీపై రెండే నిమిషాలు మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందన్నారు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేదని.. యఅలాగే బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. పహల్గాం మృతులకు నివాళి అర్పించడం బాగుందన్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పిన తీరు బాగుందని.. అలాగే రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం కూడా చాలా మందికి నచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి .. తిడుతున్నా .. తిరిగి తిట్టలేదన్నారు. లేఖలో ప్లీనరీపై పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అని పేర్కొన్నారు.
అంతర్గత విభేదాలు, కుటుంబ రాజకీయాలు: పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, కేవలం కేటీఆర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీలోని అంతర్గత రాజకీయాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఆస్తులు, నాయకత్వం కేవలం ఒకరిద్దరికే పరిమితం అవుతున్నాయని ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది. మహిళా సమానత, సామాజిక తెలంగాణ లక్ష్యాల వైఫల్యం: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహిళా సమానత సాధించడంలో, సామాజిక తెలంగాణ లక్ష్యాలను పూర్తి చేయడంలో విఫలమైందని కవిత తన లేఖలో విమర్శించినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీపై వైఖరి: ఢిల్లీ మద్యం కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత, తనను జైలుకు పంపిన బీజేపీపై ప్రతీకారం తీర్చుకోవాలని తాను భావిస్తున్నానని, అయితే పార్టీ అధిష్టానం (కుటుంబం) తనను అడ్డుకుంటున్నట్లు ఆమె లేఖలో ప్రస్తావించినట్లు చెబుతున్నారు.
కల్వకుంట్ల కవిత ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ లేఖను కొద్ది రోజుల కిందట రాసినట్లుగా తెలుస్తోంది. తాజాగా లీక్ కావడం సంచలనంగా మారుతోంది. కొంత కాలంగా పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని తనను పక్కన పెట్టారని కవిత భావస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్లీనరీ విషయంలోనూ కవితకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. పైగా వేదికపై మాట్లాడే అవకాశం కూడా రాలేదు. ఈ కారణంగా కవిత మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు.
నిజానికి ఇలాంటి అభిప్రాయాలు వెల్లడించాలని అనుకుంటే నేరుగా కేసీఆర్ ను కలిసి చెప్పవచ్చు.కానీ లేఖ రాసి..దాన్ని మీడియాకు లీక్ అయ్యేలా చేయడం అంటే.. పార్టీలో అంతర్గత రాజకీయాలు ఓ స్థాయికి చేరుకున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోందది.