Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, సహస్రల్ని తొలిరేయి రోజు ఆడించాల్సిన ఆటలు కోసం హాల్‌లోకి తీసుకొస్తారు. సహస్ర లక్ష్మీని చూసి సహస్ర, విహారి కూర్చొవాల్సిన బెడ్ క్లీన్ చేయమని చెప్తుంది. వసుధ తాను చేస్తానంటే పద్మాక్షి లక్ష్మీని చేయమంటుంది. లక్ష్మీ క్లీన్ చేస్తుంది. 

సహస్ర, విహారిని బెడ్ మీద కూర్చొపెట్టి యమున సహస్రతో కోడలా ఇదిగో బంతి అని ఇస్తుంది. ఇద్దరూ సమన్వయం చేస్తూ ఆడాలని చెప్తుంది. విహారి లక్ష్మీని చూస్తూ ఉంటాడు. తర్వాత సహస్రతో కలిసి బంటి ఆట ఆడుతాడు. తర్వాత ఇద్దరికీ బిందెలో రింగ్ వేసి రింగ్ ఆట ఆడిస్తారు. మొదటి సారి సహస్ర గెలుస్తుంది. రెండో సారి విహారి గెలుస్తాడు. లక్ష్మీని చూసి పండు కన్నీరు పెట్టుకుంటాడు. మరోవైపు అంబిక ఓ వ్యక్తికి కాల్ చేసి నేను చెప్పిన టైంకి నేను చెప్పినట్లు కరెక్ట్ టైంకి ఏం చేయాలో గుర్తుంది కదా అని మాట్లాడుతుంది. తర్వాత అతనికి లక్ష్మీ ఫోన్ నుంచి మెసేజ్ చేస్తుంది. నా గదికి 12 గంటలకు రా ఐ లవ్‌యూ డార్లింగ్ అని మెసేజ్ చేస్తుంది. తర్వాత అంబిక లక్ష్మీ  ఫోన్ చూస్తూ మా అన్నయ్య విషయంలో నాతో ఆడుకుంటావా ఇప్పుడు నేను నీతో ఆడుకుంటా చూడు అని అనుకుంటుంది.

విహారి ఫస్ట్‌నైట్ గదిలోకి వెళ్తాడు. తర్వాత పద్మాక్షి వాళ్లు సహస్రని తీసుకెళ్తారు. సహస్ర అమ్మమ్మా తాతయ్యల ఆశీర్వాదం తీసుకుంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. అందరూ సహస్రని పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తారు. వసుధ సహస్రకు పాలగ్లాస్ ఇస్తుంది. విహారి సహస్రకు లక్ష్మీ విషయం జాగ్రత్తగా చెప్పాలి అనుకుంటాడు. సహస్రని పద్మాక్షి వాళ్లు గదిలోకి పంపిస్తారు. సహస్ర పాల గ్లాస్‌తో లోపలికి వస్తుంది.

మరోవైపు అంబిక ఆ వ్యక్తిని తీసుకొచ్చి లక్ష్మీ గదిలో పెట్టి ఎక్కడైనా దాక్కొని నేను చెప్పిన టైంకి చెప్పినట్లు చేయమని అంటుంది. ఆ వ్యక్తి లక్ష్మీ గదిలో కర్టెన్ల వెనక దాక్కుంటాడు. పండు అటుగా వస్తాడు కానీ చూడడు. తర్వాత కిచెన్‌లో లక్ష్మీ ఒంటరిగా ఉంటే అక్కడికి వెళ్లి నీ ప్రేమని నీ ఇష్టాన్ని ఇలా చీకటిలోనే కలిపేస్తున్నావా అంటే దానికి లక్ష్మీ నేను చీకటిలోనే ఉన్నాను చీకటిలోనే ఉంటాను అంటుంది. నా జీవితంలో వెలుగు రావాలి నాకు వెలుగు రావాలి అని నాకు ఏం కోరిక లేదు నేను ఎలా ఉన్నా విహారి గారు ఆనందంగా ఉండాలని అంతే చాలు అని అంటుంది. పండు లక్ష్మీతో విహారి బాబు నీకు న్యాయం చేస్తానని అన్నారని సహస్రమ్మకు నిజం చెప్తానని అన్నారని చెప్తాడు.  దాంతో లక్ష్మీ షాక్ అయి సహస్రమ్మకి నిజం తెలిస్తే ఇప్పటి వరకు నేను విహారిగారు పడిన కష్టం అంతా వృథా అయిపోతుందని అని పరుగులు తీస్తుంది. 

సహస్ర విహారి కాళ్లకు దండం పెడితే విహారి కాళ్లు వెనక్కి లాక్కుంటాడు. లక్ష్మీ గది బయట ఉంటుంది. డోర్ కొట్టాలా లేదా అని ఆలోచిస్తూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. సహస్ర విహారితో బావ నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నేను బతికేదాన్ని కాదు అని అంటుంది. ఇకపై నా ప్రాణం నీది నీ కోసమే కొట్టుకుంటుంది. నీకు జీవితాంతం రుణ పడి ఉంటా బావ అని విహారిని హగ్ చేసుకుంటుంది. విహారి సహస్ర చేతులు విడిపించుకుంటాడు. సహస్ర షాక్ అయిపోతుంది. సహస్ర నీకో విషయం చెప్పాలి అని విహారి అనగానే సహస్ర కంగారు పడి తర్వాత మాట్లాడుకుందాం బావ అని పాల గ్లాస్ ఇచ్చి సగం తాగి ఇవ్వమని అంటుంది. 

లక్ష్మీ గదిలోకి వెళ్లిపోతుంది. అంబిక చెప్పిన వ్యక్తి లక్ష్మీ గదిలో లక్ష్మీని చూసి షర్ట్ తీసేసి ఉంటాడు. లక్ష్మీ అతని షూ చూసి కర్టెన్ జరిపి ఆ వ్యక్తిని చూసి దొంగ దొంగ అని అరుస్తుంది. అతను బయటకు పరుగులు తీస్తాడు. మేడ మీదకు వెళ్తాడు. లక్ష్మీ కేకలు విని అందరూ బయటకు వస్తారు. సహస్ర, విహారి కూడా బయటకు వస్తారు. బయట సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి దొంగలు ఎలా వస్తారు అని అంబిక అడుగుతుంది. లక్ష్మీ కావాలనే నాటకాలు ఆడుతుందని శోభనం చెడగొట్టడానికే ఇలా చేస్తున్నావ్ అని సహస్ర అంటుంది.  

విహారి ఇళ్లంతా చూద్దామని అంటాడు. పండు, విహారి మొత్తం వెతుకుతారు. విహారి అతన్ని ఓ చోట చూసి కిందకి తీసుకొస్తాడు. వాడిని కొడతారు. అతను నేనేం దొంగ కాదు అని లక్ష్మీ తనని పిలిస్తే వచ్చానని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఆ మాటతో విహారి అతన్ని కొడతాడు. కొడతారేంటి ఈ లక్ష్మీనే నన్ను రమ్మని పిలిచిందని అంటాడు. సాక్ష్యం కూడా ఉందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!