Meghasandesam Serial Today Episode : భూమి మాటలకు ఎమోషనల్ అయిన శరత్ చంద్ర బాధపడుతూ రూంలోకి వెళ్లిపోతాడు. బాధగా వస్తున్న శరత్ చంద్రను చూసి అపూర్వ ఏమైంది బావ అలా ఉన్నావు అని అడుగుతుంది. మన భూమి మన దగ్గరే ఉండిపోయింది కదా బావ ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది.
శరత్: ఈ నాన్న మీద ఉన్న ప్రేమ గౌరవం. తనని ఇక్కడి నుంచి కదలనివ్వలేకపోయాయి అపూర్వ. కానీ తను ప్రేమించిన వాడికి దూరం అయిపోయానన్న బాధ, భయం తన ముఖంలో నాకు స్పష్టంగా కనిపిస్తుంది. తన ప్రేమ కథలో విలన్ ఎవరో కాదు నేనే. నాన్నను కనుక నన్ను తిట్టకపోవచ్చు. కానీ మా నాన్న కారణంగానే తన ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చిందన్న ఆలోచన ఇంకా చెప్పాలంటే.. ఒక రకమైన ధ్వేషం భూమిలో అలాగే ఉండిపోతుంది. అది తలుచుకుంటే నాకు బాధగా ఉంది అపూర్వ.
అపూర్వ: బావ అలా మాట్లాడొద్దు నువ్వే ప్రాణంగా బతుకుతున్న నేను ఏమై పోవాలి చెప్పు.
శరత్: అయినా పోయి పోయి నా భూమి ఆ వెధవను ప్రేమించాలా..? వాణ్ని కాకుండా ఇంకెవరైనా అనామకుణ్ని ప్రేమించి ఉంటే ఆడంబరంగా పెళ్లి చేసేవాణ్ని కదా..?
అపూర్వ: బావ నువ్వు ఇలా బాధ పడుతుంటే చూడలేకపోతున్నాను. ఏం చేసైనా సరే ఆఖరికి నా ప్రాణం ఇచ్చైనా సరే భూమి ప్రేమ కథలో నువ్వు విలన్ కాకుండా చూస్తాను బావ. ఇది నేను నీకు చేస్తున్న ప్రామిస్
అని చెప్పగానే శరత్ చంద్ర చూస్తుండిపోతాడు. మరోవైపు రూంలో కూర్చున్న భూమి ఏడుస్తుంది. బార్ గగన్ ఫుల్లుగా మందు తాగుతుంటాడు. శరత్ చంద్ర బాధపడుతుంటాడు. బారులో ఉన్న గగన్ తాగుతూ..
గగన్: ఇంకొక పెగ్గు తీసుకురా..?
వెయిటర్: సార్ క్లోజింగ్ టైం అయింది సార్.
గగన్: రేయ్ పర్వాలేదు తీసుకురా..?
వెయిటర్: సార్ కావాలంటే మీకు పార్శిల్ తెస్తాను సార్.
గగన్: సరే తీసుకురాపో..
అని చెప్పగానే.. వెయిటర్ వెళ్లి పార్శిల్ తీసుకుని వచ్చి గగన్‌కు ఇచ్చి బిల్లు తీసుకుని వెళ్లిపోతాడు. మళ్లీ వచ్చి సార్ ఒంటి గంట అవుతుంది సార్ అని చెప్పగానే.. గగన్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. పూర్తి తాగుబోతుగా మారిపోయిన గగన్‌ను చూసి శారద్ టెన్షన్ పడుతుంది. ఎలాగైనా గగన్‌ను మార్చాలనుకుంటుంది. భూమిని ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం శరత్ చంద్ర ఇంటికి వెళ్తుంది శారద. ఇంటికి వచ్చిన శారదను శరత్, అపూర్వ కోపంగా చూస్తుంటారు.
శరత్: చెప్పు ఎందుకు కలవాలనుకున్నావు..
శాదర: మీ కూతురుని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయడం కోసం ఏం చేయమన్నా చేస్తాను.
అపూర్వ: ఇప్పుడేమంటావు శారద. నీ కొడుకుతో మా భూమి పెళ్లి కోసం ఏం చేయమన్నా చేస్తా అంటావు.
శారద: అవును.
అపూర్వ: నువ్వు అడుగుతున్నది మా బావ ప్రాణమైన భూమిని.. బదులుగా మా బావకు కూడా ఎంతో కొంత న్యాయం జరగాలి కదా..? నీ కొడుకుతో భూమి పెళ్లి జరగాలంటే.. కేపీకి నువ్వు విడాకులు ఇవ్వాలి.
అంటూ అపూర్వ చెప్పగానే.. శారద ఏం చెప్పాలో అర్థం కాక నిలబడి పోతుంది. శరత్ చంద్ర ఆశ్చర్యంగా చూస్తే.. కాస్త ఆగు బావ అన్నట్టు అపూర్వ సైగ చేస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!