Sankranthi Special Trains : సంక్రాంతి పండుగకు సొంతూళ్ల వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మరో 16 స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక రైళ్లను అధిక రద్దీ ఉండే రోజుల్లో బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. జనవరి 7వ తేదీ నుంచి 18 వరకు తెలంగాణ, ఏపీ మధ్య ఈ రైళ్లు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ రైళ్ల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
జనవరి 1 నుంచి 20 మధ్యలో
సంక్రాంతి పండక్కి జనాలు సొంతూర్లకు వెళ్లేందుకు ఆర్టీసీతో పాటు రైల్వే కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరం ఉన్న మార్గాల్లో మరో 30కి పైగా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 1 నుంచి 20 మధ్య కాలంలో ఈ స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ స్టేషన్‌ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో ఎక్కువ జనరల్ బోగీలతో పాటు, రిజర్వ్‌డ్ బోగీలు కూడా ఉండనున్నాయి. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆయా ప్రాంతాలకు చేరుకొనే విధంగా ఈ రైళ్లను నడిపేలా సమయాలను సెట్ చేశారు. ఇప్పటికే జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు 94 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వీటికి తోడు మరో 30 సర్వీసులను నడపనున్నారు. అన్ని ప్రత్యేక రైళ్లకు ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణించాలనుకొనేవారు యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.
ప్రత్యేక రైళ్లు
- సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07048) - జనవరి 6
- కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07049) - జనవరి 7
- హైదరాబాద్–నర్సాపూర్ (070 19) - జనవరి 7
- నర్సాపూర్–వికారాబాద్ (070 20) - 8
- వికారాబాద్–నర్సాపూర్ (070 21) - 9
- నర్సాపూర్–హైదరాబాద్ (07022) - జనవరి 10
- సికింద్రాబాద్–కాకినాడటౌన్ (07039) 9
- కాకినాడటౌన్–వికారాబాద్ (07040) - జనవరి 10
- వికారాబాద్–నర్సాపూర్ (07041) జనవరి 11
- నర్సాపూర్–సికింద్రాబాద్ (07042) జనవరి 12
- హైదరాబాద్ – మచిలీపట్నం (07011) - జనవరి 11, 13 తేదీల్లో
- మచిలీపట్నం–హైదరాబాద్ (07012) - జనవరి 12, 14 తేదీల్లో
- సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07035) - జనవరి 11
- కాకినాడ టౌన్–వికారాబాద్ (07036) - జనవరి 12
- వికారాబాద్– కాకినాడటౌన్ (07037) - జనవరి 13
- కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07038) - జనవరి 14
- సికింద్రాబాద్–నర్సాపూర్ (07023) - జనవరి 13
- నర్సాపూర్–సికింద్రాబాద్ (07024) - జనవరి 14
- సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07027) - జనవరి 16
- కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07028) - జనవరి 17
- సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07031) - జనవరి 15
- కాకినాడ టౌన్–వికారాబాద్ (07032) - జనవరి 16
- వికారాబాద్–కాకినాడ టౌన్ (07033) - జనవరి 17
- కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07034) - జనవరి 18
- హైదరాబాద్–నర్సాపూర్ (07015) - జనవరి 15, 17 తేదీల్లో
- నర్సాపూర్–హైదరాబాద్ (07016) - జనవరి 16, 18 తేదీల్లో