Minister Dharma Prasadarao : జన్మభూమి కార్యకర్తలు పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా బొంతలకోడూరులో మాట్లాడిన ఆయన... పర్యటించారు. జన్మభూమి కార్యకర్తలు స్వతంత్ర సమరయోధుల్లా వీధుల్లో పడి తిరిగే వాళ్లని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం చూడలేక బాదుడే బాదుడు అని చంద్రబాబు తిరుగుతున్నారన్నారు. ఉత్తరాంధ్రలో తిరుగుతూ అమరావతి రాజధాని అని చంద్రబాబు చెప్పడం మన చేతులతో మన కళ్లనే పొడిచే ప్రయత్నమే అన్నారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని చెబుతున్నారని అదే జరిగితే మాకు విశాఖ రాజధాని ఇచ్చేయండి మేము ఒక చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాల్లో ఇంకా ఎక్కడో సైకిల్ భావన ఉందని, ఇంకా సైకిల్ ని నమ్మి మోసపోవద్దన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారన్నారు. ముసలివాడు అయిన మొన్న కారుమీద ఎక్కి డాన్స్ చేశరన్నారు.
లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు
"రాష్ట్రంలో పెద్ద మార్పు జరిగింది. పూర్వం మధ్యవర్తుల వల్ల పేదలకు డబ్బు అందేది కాదు. లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందకుండా చేసేవారు. ప్రస్తుతం లబ్ధిదారులకు నేరుగా సంక్షేమఫలాలు అందుతున్నాయి. పథకాల నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోనే పడుతున్నాయి. విజయవాడలో బటన్ నొక్కితే నగదు అకౌంట్ పడిపోతుంది. టీడీపీ ప్రభుత్వం అయితే జన్మభూమి కార్కకర్తలుండేవారు. వాళ్లు ప్రజలను బెదిరించేవాళ్లు. ఇంటిపై పసుపు జెండా లేకపోతే మీ కార్డు తీసేస్తాం అని జన్మభూమి కార్యకర్తలు బెదిరించేవాళ్లు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఈ బెదిరింపులు లేకుండా చేసింది. ప్రజలకు నేరుగా నగదు అందిస్తుంది. గౌరవంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. బాదుడే బాదుడు అని టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది. ధరలు పెరిగాయని ఆరోపిస్తున్నారు కదా మిగతా రాష్ట్రాల్లో ఏమైన తక్కువగా ఉందా?. ఇవన్నీ కేంద్రం పెంచిన ధరలు. టీడీపీ నేతలు చెప్పండి నిత్యవసరాలు చౌకగా ఉంటే అక్కడి నుంచి తెచ్చుకుంది. ఈ ధరలు పెరుగుదలకు సీఎం జగన్ ఏంచేస్తారు. రాష్ట్రంలో అవినీతి లేదు, విద్యారంగంలో సంస్కరణలు చూసి టీడీపీ ఏం చెప్పాలో తెలియక ధరలు పెరిగిపోయాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. " - మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఉత్తరాంధ్రను రాష్ట్రం చేయండి
"చంద్రబాబు మొన్న రాజాం వచ్చినప్పుడు చెప్పారు. అమరావతిలోనే రాజధాని పెడతానని చంద్రబాబు అంటున్నారు. విశాఖ రాజధానిగా వద్దంటున్నారు. అమరావతిలో క్యాపిటల్ పెట్టి ఉత్తరాంధ్రను మోసం చేస్తారా? అంతకు ముందు ఇలానే మన డబ్బుంతా తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. హైదరాబాద్ చక్కగా డెవలప్ అయిన తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు అమరావతిలో డబ్బు పెడతామంటున్నారు. మరో 70 సంవత్సరాలు మన డబ్బు అక్కడ పెడతామంటున్నారు. మళ్లీ అమరావతిలో రాజధాని పెడితే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను చిన్న రాష్ట్రం చేయండి. మా రాష్ట్రాన్ని మేం పాలించుకుంటాం." - మంత్రి ధర్మాన ప్రసాదరావు