Whatsapp Broadcast: మరో రెండు రోజుల్లో తర్వాత కొత్త సంవత్సరం రానుంది. ప్రజలు ఈ వేడుకలను కుటుంబం, బంధువులు మొదలైన వారితో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ జరుపుకునే విధానం భిన్నంగా ఉంటుంది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పద్ధతి మరింత మారింది.


న్యూ ఇయర్ రోజున మీ మొబైల్ ఫోన్‌లో అందరి మెసేజ్‌లు ఒక్కొక్కటిగా ఎలా రావడం ప్రారంభిస్తాయో చూసే ఉంటారు. వీటన్నింటికీ రిప్లై ఇస్తూ కూర్చుంటే గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం మీ సమయాన్ని వృథా చేసుకోకండి. WhatsAppలో ఈ కొత్త ఫీచర్‌ని ఉపయోగిస్తే ఒకే క్లిక్‌తో 250 మందికి పైగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపచ్చు. వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్ ఉంది. దీని ద్వారా మీరు చిటికెలో చాలా మందికి మెసేజ్‌లు పంపవచ్చు.


ఈ ఫీచర్ కింద మీరు కేవలం టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే కాకుండా ఫొటోలు కూడా పంపవచ్చు. WhatsApp బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ ఫీచర్ ఈ సంవత్సరం మీకు చాలా సహాయపడనుంది. దీంతో ఒకేసారి చాలా మందికి మెసేజ్‌లు పంపే అవకాశం ఉంది. విశేషమేమిటంటే ఎదురుగా ఉన్న వ్యక్తికి గ్రూప్‌ ద్వారా మెసేజ్‌ వచ్చిందన్న విషయం కూడా అస్సలు తెలియదు.


బ్రాడ్‌కాస్టింగ్ మెసేజ్ ఎలా ఉపయోగించాలి
ముందుగా మీ మొబైల్‌లో వాట్సాప్‌ని ఓపెన్ చేయండి. దీని తర్వాత, పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు New Broadcast ఆప్షన్‌ను ఎంచుకుని దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు న్యూ ఇయర్ మెసేజ్ లేదా మరేదైనా సందేశాన్ని పంపాలనుకుంటున్న వ్యక్తులను ఎంచుకోవాలి.


ఆ తర్వాత మీరు వారికి ఏ మెసేజ్ పంపాలనుకుంటున్నారో టైప్ చేయండి. దానిని ఈ గ్రూప్‌ను ఎంపిక చేసి పంపండి. ఉదాహరణకు మీరు 'హ్యాపీ న్యూ ఇయర్' అని రాస్తే ఆ మెసేజ్ గ్రూప్‌లోని 256 మంది వ్యక్తులకు విడిగా అందుతుంది. కాబట్టి ఈసారి న్యూ ఇయర్‌లో సమయాన్ని వృథా చేయకుండా మీ ప్రియమైన వారిని స్మార్ట్‌గా విష్ చేయండి.