ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 8న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి. జనవరి 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అధాకారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షకు సంబంధించిన హాలటికెట్లను డిసెంబరు 31 నుంచి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష నేపథ్యంలో అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రశ్నప్రతం బుక్‌లెట్, ఓఎంఆర్ పత్రాల నమూనా పత్రాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పరీక్షపై అవగాహన కోసం ఈ నమూనా పత్రాలు ఉపయోగపడుతాయి. వాటిల్లో అభ్యర్థులు పరీక్షలో అనుసరించాల్సిన నిబంధనలను, ఇతర జాగ్రత్తలను క్షుణ్నంగా ఇచ్చారు. అభ్యర్థులు వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
➥ అభ్యర్థులు తమకు ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే, సూచించిన ప్రకారం అన్ని ప్రశ్నలు ఉన్నాయో లేదో చెక్ చేకోవాలి.
➥ ప్రశ్నపత్రంలో మొత్తం 4 (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి, పార్ట్-డి) విభాగాలుంటాయి. 'పార్ట్-ఎ'లో హిస్టరీ & కల్చర్, 'పార్ట్-బి'లో కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ & ఇంటర్నేషనల్ రిలేషన్స్, 'పార్ట్-సి'లో ఇండియన్ & ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్, 'పార్ట్-డి'లో జాగ్రఫీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగానికి 30 మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులు ఉంటాయి.
➥ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
➥ ఓంఎఆర్ షీటులో సమాధానాలను బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతో మాత్రమే సమాధానాలు గుర్తించాలి (సర్కిల్ పూరించాలి). అనవసరపు గుర్తులు పెట్టకూడదు. వైట్నర్ వాడకం నిషేధం.
➥ సమాధాన పత్రం నింపడానికి కూడా బ్లూ/బ్లాక్ పెన్ను మాత్రమే వాడాలి. జెల్ పెన్నులు, ఇంక్ పెన్నులు, పెన్సి్ల్స్ వాడకూడదు.
➥ సమాధాన పత్రం (ఓఎంఆర్ ఆన్సర్ షీటు)లో నిర్దేశించిన ప్రదేశంలో అభ్యర్థి సంతకంతోపాటు, ఇన్విజిలేటర్ సంతకం కూడా తప్పనిసరిగా ఉండాలి. సంతకాలు లేని సమాధానపత్రాలు పరిగణనలోకి తీసుకోరు.
➥ ఓఎంఆర్ ఆన్సర్ షీటు మీద ఏదైనా రఫ్ వర్క్ గాని, గీతలు గీయడం గాని, చింపడం, పిన్ చేయడం లాంటివి చేయకూడదు.
➥ ఓఎంఆర్ షీటులో జవాబులు మార్చడానికి వైట్నర్, బ్లేడు, రబ్బరు లేదా ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేసినా సమాధానపత్రాలను పరిశీలించరు.
➥ ఇచ్చిన ప్రశ్నలకు బుక్‌లెట్‌లో జవాబులు గుర్తించకూడదు. ఓఎంఆర్ షీటులో మాత్రమే సమాధానాలు రాయాలి. దీన్ని తీవ్రంగా పరిగణిస్తారు.
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు, మ్యాథ్స్/లాగ్ టేబుల్స్, మొబైల్‌ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఆభరణాలు కూడా వేసుకురాకపోవడం మంచిది.
➥ పరీక్ష సమయం ముగిసిన తర్వాతనే అభ్యర్థులను బయటకు పంపుతారు. పరీక్ష మధ్యాలో ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు అనుమతించరు.
➥ పరీక్షలో కాపీ/చీటింగ్‌కు పాల్పడినట్లయితే పరీక్ష నుంచి బహిష్కరిస్తారు.
➥ రఫ్ వర్కును ప్రశ్నపత్రం చివరి పేజీలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్న కారణంగా జవాబులు జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాకి 0.3 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.
పరీక్ష విధానం..
ప్రిలిమినరీ పరీక్ష:
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 120 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 మార్కులు కేటాయించారు. అదేవిధంగా 120 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 60 మార్కులు కేటాయించారు.
* మెయిన్ పరీక్ష:
మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి.
* పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు
* పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-3 (పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు
* పేపర్-4 (ఎకానమీ & డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు
* తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే
పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు...
పోస్టులు పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
Also Read:
తెలంగాణలో 783 పోస్టులతో గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ఎప్పుడంటే?
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. న్యూఇయర్ సందర్భంగా ప్రభుత్వం కానుకను అందించింది. 783 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. గతంలో 1032 పోస్టులను గ్రూప్-2 కింద భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..