Kishan Reddy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.719.30 కోట్ల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణపై నిర్వహించిన సమీక్షలో దక్షిణమధ్య రైల్వే జీఎం ఎ.కె.జైన్‌తో పాటు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 1874లో  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మించారన్నారు. తెలంగాణలోనే ఇదే అతి పెద్ద రైల్వేస్టేషన్, హైదరాబాద్ లో 3 రైల్వేస్టేషన్ లు ఉన్నాయన్నారు. రద్దీని తగ్గించడం కోసం చర్లపల్లిలో మరొ టెర్మినల్ ప్రారంభించామన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను పూర్తిగా ఆధునీకరించనున్నారని తెలిపారు. 40 ఏళ్ల తరువాత వచ్చే ప్రయాణికుల తాకిడిని తట్టుకునే విధంగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జీ + 4 కారు పార్కింగ్ తో పాటు 24 లిఫ్టులు, ఎక్సలేటర్లు, సీసీ కెమెరాల, వైఫై, అధునాతన రైల్వేస్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 






వరంగల్ లో వర్క్ షాప్ 


"దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ రైల్వేస్టేషన్ గా సికింద్రాబాద్ స్టేషన్ ను రూపొందిస్తున్నాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మూడు దశలలో పనులను పూర్తి చేయాలని అదేశాలు జారీచేశాం. 36 నెలలలో పనులను పుర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధమయ్యింది. రూ.384 కోట్లతో వరంగల్ లో 150 ఎకరాలలో వర్క్ షాప్ నిర్మాణం చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఎంఎంటీఎస్ 2వ ఫేస్ పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలం.  ఎంఎంటీఎస్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను."- కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి 


విజయవాడ-సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైళ్లు 


ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రూ.719.30 కోట్లతో రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ నిధులతో రైల్వేస్టేషన్‌ ను పూర్తిగా ఆధునికీకరిస్తామన్నారు. దక్షిణ భారత్‌లో ఉత్తమ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌ను తీర్చిదిద్దుతామని కిషన్ రెడ్డి వెల్లడించారు.  మూడు దశల్లో 36 నెలల్లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. కాజీపేటలో రూ.384 కోట్లతో వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. దీని కోసం 150 ఎకరాల భూసేకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. విజయవాడ-సికింద్రాబాద్‌ మార్గంలో వందే భారత్‌ రైళ్లు రాబోతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. వాటిని తిరుపతి వరకు పొడిగించాలని రైల్వేశాఖను కోరామన్నారు. 1300 కి.మీ మేర కొత్త లైన్ల కోసం భూసేకరణ జరుగుతోందన్నారు. 






Also Read : Raids On Rajagopal : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ సర్కార్ సడెన్ షాక్ - సుశీ ఇన్‌ఫ్రాలో సర్వీస్ ట్యాక్స్ అధికారుల సోదాలు!