Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన అభిషేక్ రావు బోయినపల్లి, విజయ్ నాయర్‌లకు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుపై సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈడీ కస్టడీకి తీసుకునేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లకు ఐదు రోజుల ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.  మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణ కోసం ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అభిషేక్, విజయ్ నాయర్‌ను కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. తన తల్లిని కలిసేందుకు అభిషేక్‌ బోయినపల్లి కోర్టు అంగీకరించింది. 


ఇద్దరికి బెయిల్ 


దిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యాపారవేత్త, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్, హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం అదుపులోకి తీసుకుంది. ఈ కేసు విషయంలో సీబీఐ వీరిద్దని అరెస్టు చేసింది. సీబీఐ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ జరిగింది. కోర్టులో విచారణకు ముందే ఈడీ అభిషేక్ రావు, విజయ్ నాయర్ ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.  దిల్లీ ఎక్సైజ్ స్కామ్‌లో ప్రధాన నిందితుల్లో విజయ్ నాయర్ ఒకరిగా ఉన్నారు. లండన్ లో ఉన్న నాయర్ ను విచారణ కోసం సీబీఐ స్వదేశానికి పిలిచింది. సెప్టెంబర్ 27న నాయర్ ను సీబీఐ అరెస్టు చేసింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో విజయ్ నాయర్ అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపణలు చేస్తుంది.  


ఏపీ, తెలంగాణలో అరెస్టులు 


దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో  సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఇద్దరు పెద్ద వ్యాపారులను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని, మరో మద్యం వ్యాపారి వినయ్ బాబును ఈడీ అధికారులు ఇటీవల అరెస్టు చేశారు. శరద్ చంద్రారెడ్డి, వినోయ్ బాబులకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో దిల్లీలో అరబిందో గ్రూపు డైరెక్టర్ పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు.  అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు శరత్ చంద్రారెడ్డి  డైరెక్టరుగా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా కూడా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో పెనాక శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. దిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.