RS Praveen accused Konda Murali of committing atrocities on girls and students: తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్ గెస్ట్ హౌజుల్లో కొండా మురళి దారుణాలు చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వరంగల్లో ఎంతో మంది అమ్మాయిలు, విద్యార్థుల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడని మండిపడ్డారు. 2002లో ఆయన ఘోరాలు భరించలేక నళిన్ ప్రభాకర్ అనే పోలీస్ ఆఫీసర్ హన్మకొండ చౌరస్తాలో బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చాడని ప్రవీణ్ కుమార్ తెలిపారు. దానికి సాక్ష్యం అప్పుడు సీఐగా ఉన్న ప్రస్తుతం వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజేనన్నారు. తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. 


కొండా సురేఖకు పదవిలో ఉండే అర్హత లేదు !                   


కొండా సురేఖను తెలంగాణ ప్రజలు గతంలోనే తిరస్కరించారని చెప్పారు. మహిళలపై చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు తీర్పునిచ్చిందని ..ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. గతంలో ఐపీఎస్‌ అధికారిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని.. ఏడేళ్ల  సర్వీస్‌ వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లో వచ్చానని తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని సురేఖ చెప్పారని మండిపడ్డారు. సురేఖ చేసిన ఆరోపణలు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్‌ చేశారు. తనపై ఆరోపణలకు ఆధారాలు ఉంటే సీబీఐ విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  


Also Read: కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్


ఫుడ్ పాయిజనింగ్ కుట్ర ఆర్ఎస్ ప్రవీణ్‌దేనని కొండా సురేఖ ఆరోపణలు               


గురుకులాల్లో వరుసగా జరుగుతున్న పుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉందని కొండా సురేఖ శుక్రవారం ఆరోపించారు.  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా ఉన్నారని.. ఆ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆయన గురుకులాల్లో సిబ్బందని నియమించారని ..వారంతా ప్రవీణ్ కుమార్ అనుచరులే అన్నారు.  ఇప్పటికి ఆయన అనుచరులు గురుకులాల్లో సిబ్బందిగా ఉన్నారన్నారు. ఆ అనుచరుల ద్వారానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలల్లో కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు.           



Also Read: పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలు- కాగజ్‌నగర్‌ మండలంలో 144 సెక్షన్




బీఆర్ఎస్ గురుకులాలబాట                  


తెలంగాణ రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ గురుకులాల బాట కార్యక్రమాన్నిప్రకటించింది. బీఆర్‌ఎస్‌ గురుకుల బాటతో కాంగ్రెస్‌లో వణుకు పుడుతోందని అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.