RGV on Swapnalok Incident: 


శివ క్లైమాక్స్ షూట్..


సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.  మృతుల కుటుబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలోనే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ఇలా జరగడం చాలా బాధాకరమని అన్న ఆయన శివ సినిమా నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. శివ సినిమా క్లైమాక్స్‌ను స్వప్నలోక్ కాంప్లెక్స్‌ పైనే చిత్రీకరించినట్టు చెప్పారు. నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స్ అక్కడే షూట్ చేసినట్టు ట్వీట్ చేశారు. ఓ నెటిజన్‌ ఆ సీన్‌కు సంబంధించిన వీడియోని పోస్ట్ చేయగా...RGV ఆ వీడియోని రీట్వీట్ చేశారు.