అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఏదో ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ హఠాత్తుగా ఆయన కొడంగల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. కోస్గిలో జరిగిన సభ్యత్వ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గం మొత్తం మీద బూత్‌కు ఐదు వందల మంది చొప్పున 75వేల మందికి కాంగ్రెస్ సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి నేతలను సన్మానించారు.


Also Read: సమూల సంస్కరణలకు ప్రోత్సాహం - మరుమూల ప్రాంతాలకూ ఆన్ లైన్ విద్య సదుపాయం ... ఈ సారి బడ్జెట్‌పై విద్యారంగానికి ఆశలెన్నో !.


119 నియోజకవర్గాలకు 75 వేల సభ్యత్వాలు చేసి ఆదర్శంగా నిలిచారని కొడంగల్ నేతలకు రాహుల్ గాంధీ తో సన్మానం చేయిస్తానని ప్రకటించారు. 2009 లో కొడంగల్ కు తాను కొత్త అయినా కడుపులో పెట్టుకొని గెలిపించారని..ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. కొడంగల్‌లో గుడి, బడి, రోడ్లు వేయించి సబ్ స్టేషన్లు, బ స్ డిపో, మద్దూరులో స్కూల్‌ భూమి, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజ్ ను కట్టించానన్నారు. కొడంగల్ ప్రతి గ్రామానికి రోడ్డు, వాటర్ ట్యాంక్ లు కట్టించానని.. కొడంగల్ లో తాగునీటి కోసం రూ. 350 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చానని గుర్తు చేశారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి తప్పితే ఇంకేం జరిగిందని ప్రశ్నించారు. వందల కోట్లతో అభివృద్ది పనులు చేసిన పోలీసుల్ని అడ్డు పెట్టుకుని ఓడించారని మండిపడ్డారు. 


రెండేళ్లలో  కృష్ణ నీళ్లతో కొడంగల్ ప్రజల కాళ్ళు కడుగుతా అన్న ఎమ్మెల్యే రోడ్లపై తట్ట మట్టి కూడా తీయలేదని విమర్శించారు. కొడంగల్ ను దత్తత తీసుకున్న కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.  2018 లో 5 మంది మంత్రులు కోస్గి బస్ డిపో కు శంకుస్థాపన చేశారని కానీ ఇంత వరకూ కట్టలేదన్నారు. నియోజకవర్గం అభివృడ్డి పై చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. కోస్గి లో 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాని.. ఆ పని తాను ఉన్నప్పుడు ఎక్కడ ఉందో.. ఇప్పుడు కూడా అక్కడే ఉందన్నారు. ఈ మూడు సంవత్సరాలు నేను కావాలనే కొడంగల్ కు రాలేదని .. వస్తే అభివృద్ధి ని అడ్డుకుంటున్నానని ప్రచారం చేసేవారన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్కులు పాస్ బుక్కు లు ఇవ్వడనికి ఎమ్మెల్యే వస్తున్నాడు ఇదా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు.


Also Read: సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో మార్పులకు కేంద్రం సిద్దం - వ్యతిరేకిస్తూ కేసీఆర్ లేఖ !


తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్కరిపైనా అక్రమ కేసులు పెట్టించలేదన్నారు. హకీమ్ పెట్ గ్రామంలో ఒక యువకుడి ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు ఆంబోసిన ఆంబోతుల్లా దాడి చేశారని..పోలె పల్లి చిన్న ఘటన జరిగితే హత్యాయత్నం కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. మా వాళ్లను ఇబ్బంది పెడుతున్న ఒక్కొక్కరికి వడ్డీతో సహా చెల్లిస్తానని రేవంత్ రెడ్డి పోలీసులుక వార్నింగ్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కు ప్రతి ఒక్కరు మామూళ్లు ఇవ్వలేక వ్యాపారులు ఏడుస్తున్నారన్నారు. మూడేండ్ల కాలం ఓపిగ్గా ఉన్నాం, అది చేతగాని తనం కాదని స్పష్టం చేశారు. కొట్లాడుదాం అంటే రెడీ అన్నారు. " బిడ్డ ఎమ్మెల్యే సద్ది కట్టుకొని షాబాద్ వచ్చి కొడుతాం.."  అని హెచ్చరించారు. 




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి