Revant Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలి, ఎమ్మెల్యే గానా లేక ఎంపీగా నా అన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. పోయిన చోటే వెతుక్కుంటా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న రేవంత్ ఈ సారి ఎమ్మెల్యే గా నే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. గతం ఎన్నికల్లో  కొడంగల్ తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి... పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచారు. తన నియోజకవర్గం కాకపోయినప్పటికి చరిష్మాలతో గెలిచానన్న ధీమా మీడియా చిట్ చాట్ లో ఆఫ్ కెమెరాలో వెల్లడించారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.                           

  


కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేసిన రేవంత్... పక్కా లెక్కలున్నాయన్నారు. దేశంలో కాంగ్రెస్ కు 150 సీట్లు వస్తాయి మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకుoటామన్నారు రేవంత్. ఇక రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ సింగిల్  డిజిట్ కే పరిమితమువుతుoదని చిట్ చాట్ లో జోష్యం చెప్పారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో వరుసగా ఏ పార్టీకి 3 సార్లు అధికారం ప్రజలు ఇవ్వలేదని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సారి ప్రజలు కాంగ్రెస్ కె పట్టం కట్టనున్నారని అన్నారు. బిజెపికి రాష్ట్రంలో అంతగా బలం లేదన్నారు రేవంత్.                


కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. తాను చాలా క్లారిటీగా ఉన్నానని అన్నారు. మరి అధికారంలోమీ వస్తే సీఎం అభ్యర్థి మీరే నా అని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు తాను చాలా క్లారిటీగా ఉన్నానని సమాధానం ఇచ్చారు రేవంత్. తాను పొలిటికల్ ఎంట్రీ నుంచి క్లారిటీగా ఉన్నానని అందుకే ఎమ్మెల్యే అయ్యాను అప్పుడు క్లారిటీగా ఉన్నాను. ఆ తర్వాత ఎంపీ అయ్యాను. టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాను ఇప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉన్నానని రేవంత్ చెప్పుకొచ్చారు. అంటే సీఎం అవుతాననే దానిపైన తాను క్లారిగా ఉన్నాను అనే దాన్ని చెప్పకనే చెప్పారు రేవంత్ రెడ్డి.                       


ఎంఐఎం బిజెపి బీ పార్టీ అని ముస్లిం లకు కూడా అర్ధమైందని... మైనార్టీలు మజ్లీస్ పార్టీని నమ్మరు అని అన్నారు రేవంత్. రాహుల్ జోడో యాత్ర, రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోoదన్నారు రేవంత్. తాము అభ్యర్థుల మీద సర్వే చేయటం లేదు ప్రజల మనసులో ఏముందన్న దానిపై సర్వే చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. అందుకే తాము అధికారంలోకి రావడంపై చాలా క్లారిటీగా ఉన్నామని అన్నారు రేవంత్ రెడ్డి.