Telangana: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు. కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు ఒక్కరూపాయి ప్రాజెక్టు తీసుకురాలేదని ఆరోపిస్తున్నారు. అంతే కాదు కేంద్ర కెబినెట్ ముందుకు వచ్చే ప్రతిపాదనల్ని కూడా నిలిపివేయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరేళ్లుగా కిషన్ రెడ్డి మంత్రిగా ఉండి తెలంగాణకు తెచ్చిందేమిటో చెప్పాలన్నారు. ఆయన వల్లనే తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు.
మూసీకి నిధుల ఇవ్వమంటే ఎందుకంత అసహనమంటూ బీజేపీ నేతల వైఖరిపై సీఎం రేవంత్ మండిపడ్డారు. కేంద్రం ప్రత్యేకంగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటైనా తెలంగాణలో ఉందా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఏపీలో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేయండని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు. తాము మెట్రో విస్తరణ ప్రతిపాదనలు పంపిన తర్వాత .. ఓ రెండు రాష్ట్రాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హైదరాబాద్ గురించి ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిపాదనలు రెడీ అయినప్పటికీ కిషన్ రెడ్డి నిలిపవేయించారన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ.
తాను చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఏ నిధులు రాకుండా ఆపానో చెప్పాలన్నారు. దీంతో శుక్రవారం ఉదయమే ఆయన కిషన్ రెడ్డికి భారీ లేఖరాశారు. అందులో తాము ఎన్ని సార్లు ఏఏ అంశాలపై కలిశామో కూడా వివరించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II, ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్ వంటి అంశాలపై ప్రధానమంత్రితో పాటు తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న మీకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం కానీ కనీసం పట్టించుకోవడం లేదన్నారు.
తాము అడుగుతోంది ప్రధాని మోదీ ఆస్తి కాదన్నారు. తాము కట్టిన పన్నుల నుంచి తమకు నిధులు ఇవ్వమని అడుగుతున్నామని ..తాము రూపాయి చెల్లిస్తూంటే 42 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయన్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణకి ఎందుకివ్వరన్నారు. మూసీకి నిధుల ఇవ్వమంటే ఎందుకంత అసహనమని.. మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డును కేంద్ర క్యాబినెట్ ఎజెండాలో ఎందుకు పెట్టడం లేదంటూ బీజేపీ అగ్రనేతలను ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. కేంద్రం ప్రత్యేకంగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటైనా తెలంగాణలో ఉంటే చెప్పాలన్నారు.
ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడుతున్న కిషన్ రెడ్డిపై రేవంత్త మండిపడ్డారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి అక్కడ రిజర్వేషన్లు రద్దుచేయాలని సవాల్ చేశాు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ..బీసీ కేటగిరిలో ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికల కోసం మంద కృష్ణను బీజేపీ కౌగిలించుకుందన్నారు. అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదన్నారు.
Also Read: పొలిటికల్ పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి! అర్జుడవుతాడా? అభిమాన్యుడవుతాడా?