Memes on stock market: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు వ్యవహారశైలే.  డొనాల్డ్ ట్రంప్‌ టారిఫ్ ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయాల కారణంగా స్టాక్‌ మార్కెట్లు పడిపోతున్నాయి. అలాగే దేశీయ బ్యాంకుల నాలుగో త్రైమాసిక ఫలితాలు బలహీనంగా నమోదు కావొచ్చన్న అంచనాలుతో సెంటిమెంట్ భారీగా దెబ్బతిన్నది.  సంస్థాగత మదుపర్ల అమ్మకాలు చేపట్టడంతో బీఎస్ఈ సెన్సెక్స్  1414 పాయింట్లు కోల్పోయింది. 73 వేల 198 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ- నిఫ్టీ 420 పాయింట్ల నష్టంతో 22 వేల 124 పాయింట్ల వద్ద స్థిరపడింది. 


స్టాక్ మార్కెట్ పతనంపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.   విదేశీఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకుంటున్నారని.. వారు వెనక్కి వెళ్లడ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.   





 స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల రిటైల్ ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి పరిస్థితిపై కొంత మంది  హిలరియస్ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. 



డీప్‌గా ఎనాలసిస్ చేసి మార్కెట్‌లోకి ఎంటరయ్యే వ్యక్తుల పరిస్థితులేమిటో వివరిస్తూ చేసిన ఓ మీమ్ వైరల్ అవుతోంది  





 బీజేపీ ప్రభుత్వం తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 


 



ట్రంప్ సుంకాల ప్రకటనలే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. కెనడా, మెక్సికో నుండి దిగుమతులపై 25% సుంకాలు ఏప్రిల్ 4 నుండి కాకుండా మార్చి 4 నుండి అమల్లోకి వస్తాయని ట్రంప్ గురువారం ప్రకటించారు. వీటికి అదనంగా చైనా వస్తువులపై 10% సుంకం విధించాడు, యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే సరుకులపై 25% సుంకం విధిస్తామని తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించాడు. వాణిజ్య విధానాలకు సంబంధించిన ఈ అనిశ్చితి మార్కెట్లో హెచ్చుతగ్గులకు కారణమైందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.                            



మరో ఆసక్తికర కథనం: వాట్సాప్‌లో గేమ్‌ ఛేంజింగ్‌ ఫీచర్‌ - ఫోన్‌పే, గూగుల్‌పేకి దబిడిదిబిడే!