తెలంగాణలో భూముల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో సీబీఐ డైరక్టర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీని కలిసేందుకు టీ పీసీసీ కొత్త టీం ఢిల్లీ వెళ్లారు. బుధవారం రాహుల్‌తోభేటీ అయ్యారు. గురువారం రేవంత్ రెడ్డి అనూహ్యంగా సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల కోకాపేట ఆ చుట్టుపక్క వేలం వేసిన భూముల అమ్మకాలపై పలు రకాల ఆరోపణలతో  ఫిర్యాదును సీబీఐ డైరక్టర్‌కు అందించారు.


Also Read : హుస్సేన్ సాగర్‌లో ఆ వినాయకులకు నో నిమజ్జనం


కోకాపేట, ఖానామేట్​ భూములను ఓ మాఫియా దోచుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోకాపేటలో తక్కువ ధరకు భూముల కొన్న ఐదు సంస్థలను వదలేది లేదని స్పష్టం చేశారు. దాదాపుగా  రూ. వెయ్యి కోట్ల స్కాం జరిగిదన్న రేవంత్ రెడ్డి దానికి  సంబంధించిన లెక్కా, పత్రాలు అన్నీ ఆధారాలతో ఉన్నాయని, సమగ్ర విచారణ కోసం సీబీఐకి ఇచ్చినట్లుగా ప్రకటించారు. తర్వాత అయినా భూములను స్వాధీనం చేసుకుని వేలం వేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కార్ ప్రోద్భలంతో సాగుతున్న భూదోపిడి అంసాన్ని పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.


Also Read : హైదరాబాద్ టు లండన్ నాన్ స్టాప్


భూముల స్కాంలో ప్రధానంగా  మై హోం రామేశ్వర్​రావుతో పాటుగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీనియర్​ ఐఏఎస్​లు జయేశ్​ రంజన్​, అర్వింద్​ కుమారులు ఉన్నారని స్పష్టం చేశారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రాజ్​పుష్ప కంపెనీ పేరుతోనూ తక్కువకు భూములు కొనుగోలు చేశారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా రేవంత్ స్పష్టం చేశారు. రామేశ్వర్ రావు కంపెనీలు 18 ఎకరాలు, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కుటుంబ సంస్థ రాజ పుష్ప 7 ఎకరాలు కొనుగోలు చేశాయమన్నారు. రూ.3 వేల కోట్లు రావాల్సిన భూములను, రూ.2 వేల కోట్లకే పరిమితం చేశారని సీబీఐకి ఇచ్చిన లేఖలో వివరించారు. 50 ఎకరాలు ఉన్న భూమి ఎకరానికో రేటు ఎలా ఉంటుందని రేవంత్ ప్రశ్నించారు.


Also Read : టీఆర్‌ఎస్ నేతలకు రక్త పరీక్షలు చేయిస్తానంటున్న బండి సంజయ్ 


కోకాపేట భూముల అమ్మకాలకు రాష్ట్రంలో ఈ ప్రొక్యూర్‌మెంట్‌ సంస్థ ఉండగా.. వేరే సంస్థతో ఎందుకు టెండర్లు పిలవాల్సి వచ్చిందన్న ప్రశ్నించారు.  ఎవరెవరు బిడ్లు దాఖలు చేశారు? వారి పేర్లను ఎందుకు వెల్లడించడం లేదని రేవంత్ ప్రశ్నించారు.  ప్రస్తుతం అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి మరింతగా దోపిడికి సహకరిస్తుందని రేవంత్ ఆరోపించారు. రూ.60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమికంతా మళ్ళీ టెండర్లు పిలవాలని రేవంత్ డిమాండ్ చేశారు. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.


బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డిపైనా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎప్పుడూ కేసీఆర్ అవినీతి గురించి ప్రశ్నిస్తారు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయరని.. వారు వారు ఒకేటనని విమర్శించారు. బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే మోడీ,అమిత్ షాలతో  చెప్పి అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో కుమ్మక్కు కాకపోతే తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నేరుగా సీబీఐ విచారణ చేయడానికి లేదని బీజేపీ నేతలు చేస్తున్న వాదనలను రేవంత్ కొట్టి పారేశారు. ఐఏఎస్ అధికారులపై సీబీఐ విచారణ.. అలాగే భూముల వేలం నిర్వహించిన సంస్థపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు. వారిని ప్రశ్నిస్తే స్కాం మొత్తం బయటకు వస్తుందన్నారు. 


Also Read : కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీపై కేసీఆర్ కూడా ఆసక్తిగా లేరా..?