Revanth Reddy gave only six months to Telangana DCC presidents: తెలంగాణలో జిల్లా అధ్యక్షులుగా నియమితులైన కాంగ్రెస్ నేతలు.. పదవి వచ్చిందని పెత్తనం చేయకుండా పని చేయాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కొత్త డీసీసీ అధ్యక్షుల పనితీరును ఆరు నెలల ప కాలంలో పరిశీలించి, సంతృప్తికరంగా లేకపోతే తీసేస్తామన్నారు. కొత్త నాయకత్వాన్ని నియమిస్తామన్నారు.ఈ నిర్ణయాన్ని ఎఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమర్థించారు. గుజరాత్ లో అయితే డీసీసీ అధ్యక్షులకు మూడు నెలలు మాత్రమే గడువు ఇస్తున్నామన్నారు.
డీసీసీల పునర్వ్యవస్థీకరణ ద్వారా పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఉద్దేశించినట్లుగా కనిపిస్తోంది. ఆక్టోబర్ 24న ఢిల్లీలో ఎయిఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్‌తో జరిగిన సమావేశంలో ఈ ప్లాన్‌ను ఫైనలైజ్ చేశారు. కొత్త DCC అధ్యక్షులు పార్టీ కార్యక్రమాలను జోరుగా చేపట్టాలి. అన్నింటినీ ఎప్పటికప్పుడు ఎసెస్ చేస్తారు. రతి జిల్లాలో AICC ఆబ్జర్వర్లు ఉంటారు టీపీసీసీ టీమ్ మీనాక్షి నటరాజన్ మూల్యాంకనం చేస్తారు. పనితీరు సంతృప్తికరంగా లేకపోతే, ఆరు నెలల తర్వాత DCC పదవులనుంచి తప్పించి కొత్త నాయకులను నియమిస్తారు. పార్టీలో 'పెర్ఫార్మెన్స్ బేస్డ్' వ్యవస్థను ప్రవేశపెట్టే వ్యూహంలోనే దీన్ని అమలు చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
33 జిల్లాల్లో DCC అధ్యక్షుల ఎంపికలో MLAలు, కార్పొరేషన్ చైర్మెన్‌లు వంచి వారికిక ఇవ్వడంతో పాటు కుల సమతుల్యతను పాటించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్లాన్‌తో పార్టీని 2028 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేయాలని రేవంత్ లక్ష్యం. కొన్నిడీసీసీల ఎంపికలో వివాదాలు వచ్చాయి. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నెతా నియామకానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అభ్యంతరంతెిిలలపారు. అలాగే మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షురాలిగా MLA భుక్యా మురళి నాయక్ భార్య భుక్యా ఉమాను నియమించడంతో వెన్నం శ్రీకాంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్ MLA మెడిపల్లి సత్యం నియామకానికి వెలిచాల రాజేందర్ అంగీకరించలేదు. వనపర్తి MLA మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య పోటీలో అసలు రేసులో లేని శివసేనా రెడ్డినినియమించారు.
రేవంత్ రెడ్డి ప్లాన్ పార్టీని బలోపేతం చేసి, 2029లో మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేస్తున్నారు.