Telangana ministers angry on Pawan Kalyan : తెలంగాణ మంత్రులు, ఇతర కాంగ్రెస్ ముఖ్యనేతలు అంతా ఒక్క సారిగా పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. వారం రోజుల కిందట కోనసీమ పర్యటనలో తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ చేసిన వ్యాఖ్యాలను వరుసగా ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమమని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడుతాయి.. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం అని హెచ్చరించారు. 

Continues below advertisement

డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న నాయకుడు మాట్లాడే మాటలు కావు. కోనసీమపై మేమెందుకు దిష్టి పెడతామని మరో మంత్రి పొన్నం ప్రభాక్ర స్పందించారు. ఆయన నాయకుడు చంద్రబాబునాయుడో, నరేంద్ర మోదీనో ఎవరో ఒకళ్ళు స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

Continues below advertisement

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ కూడా ఈ అంశంపై స్పందించారు. సినిమాలు షూటింగ్ లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి తెలంగాణ అవసరం, కానీ తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందన్నారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని అగౌరవ పరిచేలా ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వెంటనే తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి, అసలు ఈ ప్రాంతమే వద్దనుకుంటే తెలంగాణ వదిలి ఏపీలోనే ఉండాలని స్పష్టం చేశారు.  

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా  పవన్ పై విరుచుకుపడ్డారు.    మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా ఎంచుకోవటం వల్ల కోనసీమ ప్రాంతానికి పచ్చదనం లేకుండా పోయిందన్నారు.  మిమ్మల్ని ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ఎంచుకుంటే రెండున్నర గంటల సినిమాలాగా స్క్రిప్ట్ లు చదువుకుంటూ.. ఏపీ ప్రజల మన్ననలు పొందాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదన్నారు.