Revanth Reddy: లక్ష కోట్ల విలువ కల్గిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ను కొల్లగొట్టేందుకు మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తుంటే.. సీఎం కేసీఆర్, సోమేష్ కుమార్, అర్వింద్ కుమార్ లు ఆయనకు సహకరిస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు 30 ఏళ్ల టోల్ కాంట్రాక్టులో అక్రమాలు జరిగాయని కేటీఆర్ చెప్పిన సంస్థకు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని తెలిపారు. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వేల కోట్ల విలువైన కాంట్రాక్టులపై ఎలా సంతకాలు చేస్తారని ప్రశ్నించారు.
ఓఆర్ఆర్ కాంట్రాక్టును చూపి ఐఆర్బీ సంస్థ దాని 49 శాతం వాటాను సింగపూర్ సంస్థకు వేల కోట్లకు అమ్మేసుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఐఆర్బీ సంస్థకు, సింగపూర్ సంస్థకు, షెల్ సంస్థకు ఉన్న లింకులేంటో తేలాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నట్లు చెబుతున్నదంతా పచ్చి అబద్ధం అని అన్నారు. అక్రమంగా సంపాధించుకున్న వేల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టేందుకే కేటీఆర్ యూకే, యూఎస్ఏలలో పర్యటిస్తున్నారని ఆరోపించారు.
కేటీఆర్ బ్రిటన్ వెళ్లినప్పుడు రాజులు ఎక్కడున్నారు?
విదేశీ పర్యటనల్లో వారికి అవసరమైన గూడు పుఠాణీ సమావేశాలు పెట్టుకుంటున్నారని కేటీఆర్ బ్రిటన్ పర్యటకు వెళ్లినప్పుడు రాజులు ఎక్కుడ ఉన్నారో ఆ వివరాలను ప్రభుత్వం బయట పెట్టగలదా అని ప్రశ్నించారు. ఎల్లుండి లోపే ఐఆర్బీ సంస్థ 10 శాతం హెచ్ఎండీఏకు చెల్లించాలని లేకపోతే నిబంధనలు ప్రకారం వెంటనే టెండర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఈ కాంట్రాక్టుకు వెనక ఉన్న మర్మం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తామని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు చెబుతున్నారని ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ఇంత దోపిడీ జరుగుతుంటే కేంద్ర హోంశాఖను విచారణ చేయమని ఎందుకు కోరడం లేదని అడిగారు. ఇంత అవినీతి జరుగుతుంటే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదన్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఈడీ, కాగ్ సంస్థలకు ఇస్తామన్నారు. 111 జీవో ఎత్తివేత వెనక ఉన్ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, కేసీఆర్ కుటుంబ సభ్యులు 111 జీవో పరిధిలో భూములు కొనుగోలు చేశాకే జీవో ఎత్తివేశారని ఆరోపించారు. త్రిబుల్ వన్ జీవో ఎత్తివేతపై ఎన్జీటీకీ వెళ్తామన్నారు. ఏ పార్టీ నేతలైనా సరే ఈ జీవో పరిధిలో భూములు కొన్న వారి వివరాలను బయట పెట్టాలని అన్నారు.
కేసీఆర్ వ్యతిరేకత ఆధారంగానే రేవంత్ రాజకీయం !
రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ గెలవడం.. పదవులు పొందడం కాదు ముందు కేసీఆర్ ను పదవీచ్యుతుడిని చేద్దామని కలిసి రమ్మని పిలుపునిస్తున్నారు. అంతా కేసీఆర్ బాధితులే కావడంతో ఆ వైపు నుంచి రేవంత్ ప్రయత్నిస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే కేసీఆర్ ను ఎవరు ఓడించగలరో ఆ పార్టీలోనే చేరుతానని చెబుతూ వచ్చారు. ఈటల రాజేందర్ లక్ష్యం కూడా కేసీఆర్ ను ఓడించడమే. రేవంత్ పీసీసీ చీఫ్ కాక ముందు ఆ పార్టీ ఎంతో కొంత రేసులోకి వస్తుందని నమ్మకం పెట్టుకోలేకపోయారు. కానీ రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పరిస్థితి మారిందని నమ్ముతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ప్రజల్లో మార్ప కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో కేసీఆర్ కు రెండు సార్లు చాన్సిచ్చాం కదా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఈ సారి అవకాశం ఇద్దాం అనే భావన ప్రజల్లో వస్తే.. . ఎన్నికలు ఏకపక్షంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజల్లో అలాంటి భావన రావాలంటే కాంగ్రెస్ బలంగా ఉందని..గెలుస్తుందన్న నమ్మకం రావాలి. అలాంటి భావన రావాలంటే రికలు పెరగాలి. అందుకే రేవంత్.. కేసీఆర్ ను ఓడిద్దాం రమ్మని పిలుస్తున్నారు.
Also Read: పేర్లు పెట్టి మరీ నేతలకు పిలుపులు - గెలిచే పార్టీ ఇమేజ్ కోసం రేవంత్ రెడ్డి చేరికల వ్యూహాలు ?