ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కేటీఆర్ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం విడతల వారీగా టీఆర్ఎస్ నేతలు యూపీ వెళ్లి ప్రచారంలో పాల్గొనాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. అయితే, ఈ వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ యూపీలో సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తే ఎంఐఎం పార్టీకి మిత్ర ద్రోహం చేసినట్లేనని రేవంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యూపీలో ఎంఐఎం 100కి పైగా స్థానాల్లో పోటీ చేస్తోందని గుర్తు చేశారు. తెలంగాణలో ఎంఐఎంతో మిత్రపక్షంగా ఉంటూనే యూపీలో ఎస్పీకి ఎలా ప్రచారం చేస్తారని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. 


Also Read: Peddapalli: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..


గవర్నమెంట్ స్కూళ్లలోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై సీఎం కేసీఆర్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్నప్పుడు ఇంగ్లీషు మీడియం చదువును ఎలా అందిస్తారని ప్రశ్నించారు. సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారని.. పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని రేవంత్ అన్నారు. ప్రతి ప్రైవేటు కాలేజీలో 25 శాతం పేద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది చట్టంలో ఉందని అన్నారు. కానీ తెలంగాణలో అమలు కావడం లేదని అన్నారు. కేజీ టూ పీజీ విద్య ఉచితంగా అందిస్తున్నామని చెప్పి ఆ చట్టం అమలు చేయడం లేదని కేసీఆర్ చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు.


కేసీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే అసలు లెక్కలేదని అందుకే ప్రధానితో ఓమిక్రాన్‌పై వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కాలేదని అన్నారు. పబ్‌లు, బార్లు, వైన్స్‌లను కేసీఆర్ ఆదాయ వనరుగా చూస్తున్నారని చెప్పారు. మంత్రులంతా కేసీఆర్ బంట్రోతులేనని అన్నారు. వారు రైతుల వద్దకు వెళ్తే ఏం లాభమని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమయ్యాయని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 


‘‘రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు నాకు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఇది అవమానించడమే. రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్లు వచ్చి నాకు ఆహ్వాన పత్రిక ఎలా ఇస్తారు? మేము శూద్రులము, శివ భక్తులమని అవమానిస్తున్నారా. నేను ఓ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని, ఎంపీని ఎవరో వచ్చి ఆహ్వానిస్తారా. డి.శ్రీనివాస్‌ది లక్కీ హ్యాండ్. ఆయన పీసీసీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. డీఎస్ వయసును చూడొద్దు, అనుభవాన్ని చూడాలి. తండ్రి పట్ల అరవింద్‌కు ఉన్న అభిమానానికి అభినందిస్తున్నా’’ అని  రేవంత్‌ రెడ్డి తెలిపారు.


Also Read: ఎన్టీఆర్ ఆత్మ ఆ అమ్మాయిలోకి వెళ్లి నాతో మాట్లాడింది, 26 ఏళ్ల తర్వాత ఆ సీక్రెట్ చెప్తున్నా.. లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు


Also Read: Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి