Telangana CM Revanth Reddy :  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన దృష్టికి వచ్చిన  ప్రజా సమస్యల విషయంలో చురుగ్గా స్పందిస్తున్నారు. తాజాగా మధులత అనే విద్యార్థిని ఐఐటీ - జేఈఈలో మంచి ర్యాంక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ వెంటనే నిధులు విడుదల చేశారు. పేదరిక కష్టాలను ఎదుర్కొని, ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు మధులతకు రేవంత్ అభినందనలు తెలిపారు. ఏ ఆటంకం లేకుండా ఐఐటీలో తన చదువును కొనసాగించడానికి కావాల్సిన మొత్తాన్ని, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా  తెలంగాణ ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందని రేవంత్ ప్రకటించారు. ఇకముందు కూడా తను ఇలాగే రాణించి, తెలంగాణకు మరింత మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు.                                                          






మధులత రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థిని.   వీర్నపల్లి మండలం గోనే నాయక్‌ తండాకు చెందిన బదావత్ రాములు-సరోజ దంపతుల కుమార్తె. నిరుపేద కుటుంబం అయినా చదువులో విశేష ప్రతిభ చూపేవారు.  జేఈఈ మెయిన్‌లో ఎస్టీ కేటగిరీలో 824వ ర్యాంక్ సాధించింది.  కౌన్సెలింగ్‌లో మధులతకు పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది. దీంతో తన కల సాకారం అవుతందని మధులత సంబర పడింది. ఎస్టీ విద్యార్థిగా ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ.. జూలై 27 నాటికి హాస్టల్ , ఇతర ఖర్చుల కోసం రూ. 3 లక్షల  వరకూ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.  అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో తండ్రి రాములు కూడా ఏమీచేయలకేపోయారు.  అనారోగ్యం బారిన పడటతంతో  కుటుంబం గడవడమే కష్టంగా మారింది.  కుటుంబ పోషణ కోసం మధులత కూడా మేకల కాపరిగా మారింది.                  


చదువులో చురుకైన విద్యార్థిని, ఐఐటీలో సీటు వచ్చినా వెళ్లలేకపోతున్న దుస్థితిని ఆమె ఉపాధ్యాయులు  గుర్తించారు. సాయం కోసం పలువుర్ని  సంప్రదించారు. విషయం మీడియాకు తెలియడంతో.. కథనాలు ప్రసారం అయ్యాయి. వెంటనే ప్రభుత్వం  దృష్టికి వెళ్లింది. సీఎం రేవంత్  తక్షణం స్పందించి ఆమెకు  కావాల్సిన ఆర్థిక సాయాన్ని మంజూరు చేయడంతో ఐఐటీలో చేరేందుకు వెళ్తున్నారు.