Ramachandran Pillai gets bail in Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుదీర్ఘంగా జైల్లో ఉన్న వారికి బెయిల్స్ లభిస్తున్నాయి. ఇటీవల మనీష్ సిసోడియాతో పాటు కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించింది. తాజాగా రామచంద్రన్ పిళ్లైకి కూడా ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. రామచంద్రన్ పిళ్లై గత ఏడాది మార్చి నుంచి ఢిల్లీ జైల్లో ఉన్నారు. ఆయనను కవిత బినామీగా సీబీఐ చెబుతోంది. ఓ సారి అప్రూవర్ గా మారి స్టేట్ మెంట్ ఇచ్చారు. తర్వాత ఉసంహరించుకుంటానని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ గందరగోళం మధ్య ఆయన జైల్లోనే ఉండిపోయారు. తాజాగా ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది. 


సౌత్ లాబీలో రామచంద్రన్ పిళ్లై కిలక వ్యక్తి అని సీబీఐ, ఈడీ అభఇయోగాలు నమోదు చేసింది.  పిళ్లై ఇండోస్పిరిట్ లిక్కర్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి లంచాలు స్వీకరించారని....  ఆ లంచాలను ఈ కేసులో ఇతర నిందితులకు అందించాడని చార్జిషీటులో సీబీఐ పేర్కొన్నది. విచారణ సమయంలో పిళ్లై తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.  సాక్ష్యాలను నాశనం చేయడంలో అతడి పాత్ర కూడా ఉందని ఈడీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇదే కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్‌ పాఠక్‌కు కూడా రెండు రోజుల కిందటే బెయిల్ లభించింది. 


అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా కీలక నివేదిక , 23 చోట్ల ఎన్ని కూల్చారంటే!


ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపుగా అందరికీ బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్ మాత్రమే జైల్లో ఉన్నారు. ఆయన దాకలు చేసుకున్న పిటిషన్ పై  సుప్రీంకోర్టు  తీర్పును రిజర్వ్‌ చేసింది. త్వరలో ఈ పిటిషన్ పై తీర్పు రానుుంది. అయితే ఇది కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కాదు.తన అరెస్టు అక్రమం అని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్. మరో వైపు బెయిల్ పిటిషన్లపై కూడా విచారణ జరుగుతున్నాయి. అందరికీ బెయిల్ వస్తున్నందున.. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో చార్జిషీట్లు దాఖలు చేసి.. దర్యాప్తు పూర్తయిందని సీబీఐ, ఈడీ కోర్టులకు తెలిపినందున మిగిలిన వారికి కూడా బెయిల్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇతర నిందితులకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా బెయిల్ వచ్చే అవకాశాలను సూచిస్తున్నాయని అంటున్నారు.  


ఆక్రమణదారులు జైలుకే- స్వచ్చందంగా వదలుకోకుంటే చర్యలు తప్పవు- హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్                 


అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటికీ ఆయన పదవికి రాజీనామా చేయలేదు. మంత్రులే పాలనను నిర్వహిస్తున్నారు.కేజ్రీవాల్ సీఎం హోదాలోనే జైల్లో ఉంటున్నారు.ఆయనతో రాజీనామా  చేయించాలని కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. కానీ కోర్టులు ఆయా పిటిషన్లు కొట్టి వేశాయి. జైలు నుంచే విధులు నిర్వహిస్తున్న సీఎంగా కేజ్రీవాల్ రికార్డు సృష్టించారు. ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది..కానీ సీబీఐ కేసులో మాత్రం రాలేదు.