Telangana News :  స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరికి టిక్కెట్ ఖరారు చేసినా.. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య మాత్రం ఆశ వదులుకోవడం లేదు. ఆయనకు రైతు  బంధు సమితి చైర్మన్ పదవి ఇచ్చారు .  అయినప్పటికీ.. రాజయ్య టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు.  రజాభిమానం తనకే ఉందని, దానిని సర్వేలు , ఇతర నివేదికల ద్వారా అధిష్ఠానం తెలుసుకుని నిర్ణయం మార్చుకుంటుందని చెప్పారు.  రైతుబంధుసమితి రాష్ట్ర కార్యాలయంలో ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారు.  


పదవి ఇచ్చినా ఇంకా ఎందుకు రాజయ్య ఆశలు పెట్టుకున్నారు ?                     


 కడియం శ్రీహరికి ఇప్పటికే టికెట్ కేటాయించగా.. అభ్యర్థుల జాబితాలో మార్పులు ఉండొచ్చంటూ రాజయ్య వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తనకు టికెట్ వస్తుందనే ఆశ ఇంకా ఉందని చెబుతూ వస్తున్నారు. తాజాగా మరోసారి రాజయ్య అలాంటి వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలు తనవైపే ఉన్నారని, టికెట్‌పై ఆశాజనకంగానే ఉన్నానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయనను బుజ్జగించేందుకు రైతుబంధు సమితి చైర్మన్ పదవిని కేసీఆర్ కట్టబెట్టారు.  తాను ఎమ్మెల్యేగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజలు అభిప్రాయాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


టిక్కెట్ లేదని  బుజ్జగించడానికే పదవి - అయినా ఆగని రాజయ్య                   


స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు ఈసారి టికెట్ దక్కలేదు. అక్కడ కడియం శ్రీహరికి ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. టికెట్ దక్కకపోవడంతో కన్నీటి పర్యంతం అయిన రాజయ్య, ఆ తర్వాత సర్దుకుపోయారు. తాను సీఎం కేసీఆర్ వెంటే ఉంటానన్నారు.  స్టేషన్ ఘన్‌ పూర్ టికెట్ రాకపోవడం బాధగా ఉన్నా అందరి మద్దతు పొందుతున్నందుకు సంతోషంగా ఉందని చెబుతూ వస్తున్నరు. ఇటీవల  కడియం, రాజయ్యను ప్రగతి భవన్​కు పిలిపించుకున్న కేటీఆర్.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. స్టేషన్​ఘన్​పూర్​లో కడి యం శ్రీహరి గెలుపునకు కృషి చేయాలని, సముచిత స్థానం కల్పిస్తామని రాజయ్యకు హామీ ఇచ్చారు. అందుకే పదవి ఇచ్చారు. అయినా రరాజయ్య తగ్గలేదు. 


కడియం శ్రీహరి గెలుపు కోసం పని చేస్తారా ?                                    


సీఎం  కేసీఆర్ అన్ని రకాల సర్వేలను చూసిన  తర్వాతనే.. టిక్కెట్లు ఖరారు చేశారు. అందుకే  పదిహేనో తేదీన అందరికీ బీఫామ్ లు ఇవ్వనున్నారు. ఇలాంటి సమయంలోనూ రాజయ్య ఆశలు పెట్టుకోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. చివరికి ఏదో ఓ పార్టీ తరపున బరిలోకి దిగే ఆలోచన చేస్తున్నారా అన్న సందేహలు వ్యక్తమవుతున్నాయి.