తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో పడమటి దిశ‌ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వివరించింది. వీటి ప్రభావంతో సోమవారం నుంచి మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది. మిగ‌తా‌చోట్ల పొడి వాతా‌వ‌రణం ఉంటుందని వివరించింది. 


అయితే, గత 24 గంటల్లో నారాయణపేట జిల్లాతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం పడింది. అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా తాండూర్‌, యాలాల్‌ జిల్లాల్లో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


Also Read: KCR Runa Mafi : ఈ నెలలోనే రూ.50వేల రుణమాఫీ..! రైతులకు కేసీఆర్ వరం..!


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ ఇలా..
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పడమటి గాలుల ప్రభావం కనిపిస్తోందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ పడమర గాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో వానలు పడతాయని వారు అంచనా వేశారు. రాగల మూడు రోజులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ అధికారులు ఓ నివేదికను విడుదల చేశారు. దాని ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో వర్షాలు కురవనున్నాయి. సోమవారం, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.


Also Read: Padi Koushik Reddy: బంపర్ ఆఫర్ కొట్టిన పాడి కౌశిక్ రెడ్డి.. నామినేటెడ్ ఎమ్మెల్సీ ఖాయం.. కారణం అదేనా?


దక్షిణ కోస్తాంధ్రాలో సోమవారం, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. సోమవారం, మంగళ, బుధవారాల్లో రాయలసీమ ప్రాంతంలో కూడా తేలికపాటి వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. కాబట్టి, వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని చోట్ల పిడుగుల పడే అవకాశం కూడా మెండుగా ఉన్నందున వర్షం పడే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 


Also Read: TS BJP : బండి సంజయ్‌ పాదయాత్ర వాయిదా తప్పదు..! తెర వెనుక ఆ సీనియర్ నేతే చక్రం తిప్పారా..?


తెలంగాణ రెండు వారాల క్రితం ఎడతెరిపి లేని వర్షాలు పడిన సంగతి తెలిసిందే. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఏపీ, తెలంగాణలో అన్ని జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. శ్రీశైలం గేట్లు కొద్ది రోజుల క్రితమే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండగా, తాజాగా నాగార్జున సాగర్ గేట్లను కూడా ఎన్ఎస్పీ అధికారులు ఆదివారం సాయంత్రం ఎత్తి నీటిని వదులుతున్నారు.