Prakash Raj :  సినీ నటుడు ప్రకాష్ రాజ్  విలక్షణ నటుడు మాత్రమే కాదు మంచి సామాజిక స్పృహ ఉన్న రాజకీయ నాయకుడు కూడా. అయన తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని చాలా కొద్ది మందికి తెలుసు. అయితే ఆ గ్రామాన్ని లో ప్రోఫైల్‌లోని అద్భుతంగా డెవలప్ చేశారు. తాను దత్తత తీసుకున్నది మరుమూల పల్లె అయినప్పటికీ మౌలిక సదుపాయాల విషయంలో ఊహించనంత అభివృద్ధి చేశారు. 


షాద్ నగర్ దగ్గర కొండారెడ్డి పల్లెదను దత్తత తీసుకున్న ప్రకాష్ రాజ్ 
 
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన గ్రామ‌జ్యోతి కార్య‌క్రమం స్ఫూర్తితో 2015, సెప్టెంబ‌ర్‌లో షాద్‌న‌గ‌ర్ నియోజక‌వ‌ర్గం ప‌రిధిలోని కేశంపేట మండ‌లంలోని కొండారెడ్డిప‌ల్లి గ్రామాన్ని ప్ర‌కాశ్ రాజ్ ద‌త్త‌త తీసుకున్నారు. ఆ త‌ర్వాత గ్రామాభివృద్ధికి ఆయ‌న ప్ర‌త్యేక చొర‌వ తీసుకున్నారు. సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్, దిమ్మెలను ఏర్పాటు చేశారు. చెట్లను పెంచి గ్రామంలోని వీధులన్నింటిని ఆకుప‌చ్చ‌గా తయారు చేశారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు ప్ర‌కాశ్ రాజ్.



ఈ ప్రగతిని కేటీఆర్ కూడా ప్రశంసించారు.  ప్ర‌కాశ్ రాజ్ ద‌త్త‌త తీసుకున్న గ్రామం ఎంతో అభివృద్ధిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.  స్థానిక ఎమ్మెల్యే అంజ‌య్య‌తో క‌లిసి గొప్ప పురోగ‌తిని సాధించార‌ని కేటీఆర్  ప్రశంసించారు. 





ప్రకాష్‌రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో  అభివృద్ధి పనులు చేపట్టారు.  కొండారెడ్డి పల్లెలోఈ 1680 మంది ఓటర్లు, 588 కుటుంబాలు ఉన్నాయి. మంచినీటి సమస్య, అండర్‌గ్రౌండ్ డైనేజీ వ్యవస్థ, సిసి రోడ్లు తది తర పనులు చేపట్టారు.  ప్రకాష్‌రాజ్ ఫౌండేషన్ తరపున ప్రత్యేకంగా కొంత మందిని నియమించి  ప్రధాన సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు ఆరోగ్య సం బంధమైన మెగా హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు.  గ్రామంలో పశువైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  


తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో సులువుగా అభివృద్ధి పనులు


తెలంగాణ ప్రభుత్వంతో ప్రకాష్‌రాజ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  కేటీఆర్ , కేసీఆర్‌లతో ఆయన  రాజకీయ  పరంగా కూడా  సాన్నిహిత్యం ఉంది. గ్రామాభివృద్ధి కోసం ప్రకాష్ రాజ్ ఏదైనా విన్నపం చేస్తే వెంటనే అధికార యంత్రాగం కూడా స్పందిస్తారు. ఈ కారణంగా కొండారెడ్డి పల్లెను ప్రకాష్ రాజ్ అభివృద్ధి చేయగలిగారు. అక్కడి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించగలిగారు.